Corona: కరోనా మిగిల్చిన విషాదం.. అక్షర రూపంలో పొంగిన దుఖం.. గుండెల్ని పిండేస్తున్న ఐదో తరగతి విద్యార్థిని లేఖ

కరోనా సృష్టించిన విషాదం అంతాఇంతా కాదు. కొవిడ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కళ్లల్లో కన్నీళ్లు ఆరవు. ఎన్నో కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచిన కరోనా మహమ్మారి లేత మనసులపై బలమైన ముద్ర వేసింది. తెలంగాణలో...

Corona: కరోనా మిగిల్చిన విషాదం.. అక్షర రూపంలో పొంగిన దుఖం.. గుండెల్ని పిండేస్తున్న ఐదో తరగతి విద్యార్థిని లేఖ
Corona Letter
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 24, 2022 | 8:36 PM

కరోనా సృష్టించిన విషాదం అంతాఇంతా కాదు. కొవిడ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కళ్లల్లో కన్నీళ్లు ఆరవు. ఎన్నో కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచిన కరోనా మహమ్మారి లేత మనసులపై బలమైన ముద్ర వేసింది. తెలంగాణలో(Telangana) నిన్నటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. నిన్న పాఠశాలలకు చివరి రోజు కావడంతో ఓ విద్యార్థిని తన స్నేహితురాలికి లేఖ(Letter) రాసింది. కరోనా సృష్టించిన విషాదాన్ని అక్షరం రూపంలో విశదీకరించింది. కన్న తండ్రిని పోగొట్టుకున్న ఓ చిన్నారి గుండెలో వేదన లేఖగా మారింది. కరోనా సమయంలో కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం చేస్తే ఒంటరిగా పడిన యాతన.. చివరికి కన్నతండ్రి కళ్ల ముందు విగత జీవిగా పడి ఉంటే దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన.. అన్నింటినీ తన లేఖలో వివరించింది. రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సుధామాధురి ఐదో తరగతి చదువుతోంది. ఆదివారం నుంచి వేసవి సెలవులు కావడంతో శనివారం చివరి రోజు తన స్నేహితురాలికి లేఖ రాసింది. కరోనా సమయంలో చిన్నారి అనుభవించిన మానసిక వేదన చదివిన వారిని కంటతడి పెట్టించింది.

లేఖలోని విషయం..

హలో జాహ్నవి. ఎట్లున్నవ్. నేను బాగున్నా. ఈ కరోనా వల్ల చాలా జనం చనిపోయారు. అట్లాగే మా నాన్నకు కరోనా వచ్చింది. అప్పుడు మా ఊరోళ్లకు అందరికి తెలిసింది. మా నాన్నకు కరోనా వచ్చిందని అప్పుడు మమ్మల్ని దుకాణంలకి రానివ్వలే. అప్పుడు మాకు చాలా బాధగా అనిపించింది. మా నాన్న చానా హాస్పిటల్లో తిరిగారు. ఐనా ఎక్కడా హాస్పిటల్లో తీసుకోలేదు. అప్పుడు మేము మాకు తెలిసిన ఒక వ్యక్తి హాస్పిటల్లనే పని చేస్తడు. అతనికి మేము ఫోన్ చేసిన కూడా స్టెచ్చర్స్ కాలీగా లేవు. మేము హైదరాబాద్ లో ఓక రూమ్ కాలీగా ఉంది. మా నాన్న హాస్పిటల్లో ఉన్న మూడో రోజు ఉదయం 3 గంటలకు మా నాన్న మాకు ఫోన్ చేసి, నాకు ఊపిరి ఆడట్లేదు. మా నాన్నను హస్పిటల్ బయట నిలబెట్టారు అని మా నాన్న ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు మేము ఏడుస్తున్నాము. అప్పటికే 3 గంటలకు నాన్న చనిపోయాడు. మాకు తెల్వదు. మా అమ్మకు తెలిసింది. చాన ఏడిసింది. తేదీ.21-04-2021 చనిపోయాడు. ఫేస్ మొత్తం చాన తెల్లగా అయింది. బక్కగా ఉండు. మేము ఏడ్చాము. అప్పుడే మేము రాత్రి అసలు నిద్రనే పోలేము.

సుధ మాధురి యూపీఎస్.లింగారెడ్డిగూడెం ఐదో తరగతి

Corona Letter

Corona Letter

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి