Hyderabad: మండుతున్న ఎండలతో పెరిగిన బీర్ల విక్రయాలు.. అమ్మకాలు, ఆదాయంలో ఆ జిల్లా టాప్
ఎండలు మండిపోతున్నాయి. భగ్గుమంటున్న భానుడి సెగలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ సమయంలో చల్లని ద్రవాలను తాగేందుకు ఇష్టపడుతున్నారు. కూల్ డ్రింక్ లు, పండ్ల రసాలకు గిరాకీ పెరుగుతోంది. అంతేకాదు..
ఎండలు మండిపోతున్నాయి. భగ్గుమంటున్న భానుడి సెగలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ సమయంలో చల్లని ద్రవాలను తాగేందుకు ఇష్టపడుతున్నారు. కూల్ డ్రింక్ లు, పండ్ల రసాలకు గిరాకీ పెరుగుతోంది. అంతేకాదు.. వేసవి(Summer) తాపంతో అల్లాడుతున్న మద్యం ప్రియులు బార్‌లు, వైన్‌షాపుల వద్ద బారులు తీరుతున్నారు. నిప్పులు చెరిగే ఎండల నుంచి ఉపశమనం కోసం చల్లని బీర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు నెలలుగా హైదరాబాద్(Hyderabad) గ్రేటర్‌లో బీర్‌ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టడం విశేషం. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 21,68,537 కేసుల బీర్ విక్రయాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఒక్క జిల్లాలోనే ఈ నెలలో ఇప్పటి వరకు 7.57 లక్షల కేస్‌లకుపైగా బీర్‌లు అమ్ముడైనట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో 2.7 లక్షల కేసులకు పైగా మద్యం విక్రయాలు జరగగా ఈ నెలలో ఇప్పటి వరకు 1.85 లక్షల కేస్ లు మాత్రమే అమ్ముడయ్యాయి.
గత నెలలో రంగారెడ్డి జిల్లాలో అన్ని రకాల మద్యం, బీర్‌ల అమ్మకాలపై రూ.389 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.398.32 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. వచ్చే మే నెలలోనూ ఐఎంఎల్ లిక్కర్ కంటే బీర్‌ల అమ్మకాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also read:
PBKS vs CSK IPL 2022: పంజాబ్ ముందు చెన్నై రికార్డ్ ఎలా ఉందంటే..!
Credit Card: మీరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!