PBKS vs CSK IPL 2022: పంజాబ్‌ ముందు చెన్నై రికార్డ్‌ ఎలా ఉందంటే..!

PBKS vs CSK IPL 2022: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని చివరి బంతికి ఫోర్‌ కొట్టి గెలిపించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై అభిమానుల్లో

PBKS vs CSK IPL 2022: పంజాబ్‌ ముందు చెన్నై రికార్డ్‌ ఎలా ఉందంటే..!
Pbks Vs Csk
Follow us
uppula Raju

|

Updated on: Apr 24, 2022 | 4:35 PM

PBKS vs CSK IPL 2022: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని చివరి బంతికి ఫోర్‌ కొట్టి గెలిపించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై అభిమానుల్లో మళ్లీ ఆశలు రేకెత్తాయి. అయితే IPL 2022 సీజన్‌లో చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. అయినప్పటికి చెన్నై శక్తివంతంగానే కనిపిస్తుంది. ఏప్రిల్ 25 సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది​రెండో మ్యాచ్‌. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ సులువుగా గెలిచింది. అయితే ముంబై పై గెలిచిన నేపథ్యంలో చెన్నై మరింత ఉత్సాహంగా మైదానంలోకి దిగబోతుంది.

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ రికార్డును పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ పైచేయిగా ఉంది. పంజాబ్‌తో ఆడిన 26 మ్యాచ్‌ల్లో 15 విజయాలు సాధించింది. అదే సమయంలో పంజాబ్ 11 విజయాలు సాధించింది. ఇక ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే.. ఏప్రిల్ 3న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లియామ్ లివింగ్‌స్టన్ 32 బంతుల్లో 60 పరుగుల సాయంతో 180 పరుగులు చేయగా.. చెన్నై జట్టు మొత్తం 126 పరుగులకే కుప్పకూలింది. 54 పరుగుల తేడాతో మ్యాచ్‌ ఓడిపోయింది.

ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడితే.. లియామ్ లివింగ్‌స్టన్ పంజాబ్ తరఫున అత్యధికంగా 226 పరుగులు చేశాడు. ఇందులో స్ట్రైక్ రేట్ 182, 3 హాఫ్ సెంచరీలు, 16 సిక్సర్లు ఉన్నాయి. చెన్నై తరఫున శివమ్ దూబే 161 స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు, 14 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్‌లో చెన్నై అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో 12 వికెట్లు తీయగా, పంజాబ్‌ తరఫున లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ 10 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Blood Sugar Levels: రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించే ఆహారాలు ఇవే..!

Coronavirus: కరోనాని నివారించాలంటే ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Tea Side Effects: ఇవి తిన్న తర్వాత ఎప్పుడూ టీ తాగవద్దు.. చాలా ప్రమాదం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!