Khelo India University Games: బెంగళూరు వేదికగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్.. ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య..

KIUG 2021: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి . కరోనా కారణంగా, గత సంవత్సరం ఈ ప్రత్యేక ఆటలను నిర్వహించలేదు.

Khelo India University Games: బెంగళూరు వేదికగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్.. ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య..
Kiug 2021
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 24, 2022 | 4:03 PM

KIUG 2021: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా గత సంవత్సరం ఈ ప్రత్యేక ఆటలను నిర్వహించలేదు. ఈ సారి కరోనా అదుపులోనే ఉండటంతో ఈ ప్రత్యేక టోర్నమెంట్‌ను పూర్తి సన్నాహాలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ గేమ్స్‌ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఇక ఈ గేమ్స్ ప్రారంభోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, థావర్ చంద్ గెహ్లాట్‌లు పాల్గొన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో దేశవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు.

కాగా, టోర్నీ ప్రారంభోత్సవ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ ఖేలో ఇండియా గేమ్స్ 2020లో జరుగగా.. అప్పుడు 158 విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుండి 3,182 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సారి క్రీడాకారుల సంఖ్య భారీగా పెరిగింది.

ప్రారంభోత్సవానికి ప్రముఖుల రాక.. బెంగళూరు కంఠీరవ ఇండోర్ స్టేడియం స్టేడియం వేదికగా జరుగనున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభిస్తారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర క్రీడల మంత్రి నిసిత్ ప్రతీక్ కూడా గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. అదే సమయంలో, చాలా మంది మాజీ, అనుభవజ్ఞులైన క్రీడాకారులు కాడా హాజరుకానున్నారు.

కేంద్ర స్పోర్ట్స్ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రెండవసారి నిర్వహిస్తున్నామని, ఈసారి జైన్ విశ్వవిద్యాలయం ఈ క్రీడలకు ఆతిథ్య విశ్వవిద్యాలయంగా ఉంటుందని చెప్పారు. ‘‘KIUG 2021లో దాదాపు 190 విశ్వవిద్యాలయాల నుండి 3,879 మంది కంటే ఎక్కువ మంది పాల్గొననున్నారు. వీరు 20 క్రీడా విభాగాల్లో 257 బంగారు పతకాల కోసం పోటీ పడతారు. మల్లఖాంబ్, యోగాసన్ వంటి స్వదేశీ క్రీడలను కూడా ఈ క్రీడల్లో చేర్చడం జరిగింది.’’ అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఇండియా గ్రీన్ గేమ్స్.. ఈ క్రీడల్లో తొలిసారిగా ఈసారి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ గేమ్ మొదటి ఖేలో ఇండియా గ్రీన్ గేమ్స్ అవుతుందన్నారు. ఈ టోర్నమెంట్‌లో పునర్వియోగ వస్తువులను మాత్రమే ఉపయోగించడం జరుగుతుందన్నారు. ‘జీరో వేస్ట్, జీరో ప్లాస్టిక్’ నినాదంతో ఈ గేమ్‌లు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాదు.. క్రీడల కోసం మొట్టమొదటిసారిగా మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగిందన్నారు. ఇందులో క్రీడల గురించి అవసరమైన మొత్తం సమాచారం ఉంటుంది. అథ్లెట్ల్స్ ఆటల ముందు, ఆట సమయంలో దీనిని ఉపయోగించగలరని తెలిపారు. యాప్ సహాయంతో, డిజిటల్ ఇండియా విజన్‌తో ఆటగాళ్లను కనెక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

Also read:

Motorola G52: మోటరొలా నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఏప్రిల్‌ 25న విడుదల.. ఫీచర్స్‌.. ధర వివరాలు!

UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

Summer Trains: రైళ్లల్లో వేసవి రద్దీ.. ఊసే లేని క్లోనింగ్ రైలు సర్వీసులు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!