Summer Trains: రైళ్లల్లో వేసవి రద్దీ.. ఊసే లేని క్లోనింగ్ రైలు సర్వీసులు
రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో క్లోనింగ్ రైళ్లను(Clone Trains) నడపాలని రెండేళ్ల క్రితం భారతీయ రైల్వే(Indian Railway) వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. కొన్నాళ్లు సేవలందించిన ఈ రైళ్లు.. మరికొన్నాళ్లకు ఆగిపోయాయి. ప్రస్తుతం వేసవి సెలవులు...
రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో క్లోనింగ్ రైళ్లను(Clone Trains) నడపాలని రెండేళ్ల క్రితం భారతీయ రైల్వే(Indian Railway) వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. కొన్నాళ్లు సేవలందించిన ఈ రైళ్లు.. మరికొన్నాళ్లకు ఆగిపోయాయి. ప్రస్తుతం వేసవి సెలవులు, శుభకార్యాలు ఉండటంతో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్లు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఆ రైళ్లల్లో వెయిటింగ్ లిస్ట్ లోనే వందల సంఖ్య ఉండటాన్ని చూస్తుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఈ క్రమంలో రైల్వే అధికారులు క్లోనింగ్ రైళ్లను పట్టాలెక్కించి, పరిస్థితిని చక్కదిద్దకుండా చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోజూ వెళ్లే రైళ్లకు క్లోనింగ్‌గా ఇవి ఉంటాయి. వాటికంటే 2 లేదా 3 గంటల ముందే గమ్యస్థానానికి చేరుకుంటాయి. ప్రత్యేక రైళ్లకే ‘క్లోనింగ్’ అని పేరు పెట్టి వీటిని నడుపుతారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్(Secunderabad)-దానాపూర్, బెంగళూరు-దానాపూర్ మధ్య మొట్టమొదటగా ఒక సంవత్సరం పాటు క్లోనింగ్ రైళ్లు నడిపారు. రెండోదశలో సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖపట్నం రూట్లలోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. అయితే, అవి పట్టాలెక్కలేదు.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ఏ రైలును చూసినా వెయిటింగ్ లిస్ట్ 200కు తగ్గడం లేదు. ఇలాంటి తరుణంలో వెయిటింగ్ అధారంగా అదే మార్గంలో ఒక క్లోనింగ్ రైలును నడుపుతారు. సంబంధిత ప్రయాణికులంతా ఆ రైలులో గమ్యస్థానాలకు చేరుతారు. హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ల తరహాలో ఈ క్లోనింగ్ రైళ్లకు టికెట్ ధరలనూ రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. రైల్వే టికెట్ల రిజర్వేషన్ సమయంలోనే క్లోనింగ్ రైలులో వెళ్తారా..? అని రిజర్వేషన్ కేంద్రాల్లోని సిబ్బంది ప్రయాణికులను అడుగుతారు.
ఇందుకు మనం సిద్ధమైతే.. ఇలా నిరీక్షణ జాబితాలో ఉన్నవారందరికోసం ఒక రైలును వేసి రెగ్యులర్ ట్రైన్‌కు రెండు, మూడు గంటల ముందుగానే దాన్ని నడుపుతారు. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు తగినన్ని రైళ్లు అందుబాటులో లేక చాంతాడంతా నిరీక్షణ జాబితాలతో వారంతా ఇబ్బందులు పడుతుంటారు. ఈ విధానం అమలైతే.. తమకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని శ్రీవారి భక్తులు చెబుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: