Belly Fat: ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్‌ హాంఫట్.. సమ్మర్‌లో ఈ పానీయాలు తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

How To Lose Belly Fat in Telugu: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మనం అవలంభిస్తున్న జీవనశైలి, తీసుకునే ఆహారం, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల

Belly Fat: ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్‌ హాంఫట్.. సమ్మర్‌లో ఈ పానీయాలు తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
Weight Loss
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 24, 2022 | 1:26 PM

How To Lose Belly Fat in Telugu: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మనం అవలంభిస్తున్న జీవనశైలి, తీసుకునే ఆహారం, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య అందరినీ వెంటాడుతోంది. అందుకే చాలామంది స్లిమ్ నడుము కోసం ఏవేవో డైట్లు పాటిస్తూ.. వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ఇది చాలా మందికి సవాలుగా ఉంటుంది. అయితే.. డైట్‌లో కొన్ని ఆహారాలు, పానీయాలను జోడించడం వలన మీ కలల శరీరాన్ని సాధించుకోవచ్చు. వాస్తవానికి వ్యాయామం, జీవనశైలి మార్పులతో పొట్ట కొవ్వును తగ్గించేందుకు సహాయపడే అనేక పానీయాలు ఉన్నాయి . మీ జీవక్రియను పెంచడానికి, బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించడానికి మీ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. కొన్ని పానీయాలతో బరువు తగ్గడంతో.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టవచ్చు. ఆ పానీయాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే పానీయాలు..

  • నీరు: భోజనానికి ముందు పుష్కలంగా నీరు తాగడం వలన కేలరీలను వేగంగా బర్న్ చేసుకోవచ్చు. దీంతోపాటు పొట్ట ఫ్లాట్ గా ఉంటుంది. నీరు వాస్తవానికి ఉత్తమమైన ఫ్యాట్ బర్నర్.. ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు మొత్తం ఆరోగ్యానికి కూడా నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నీరు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపి జీవక్రియను పెంచుతుంది. శరీరంలో పలు ద్రవాలను సమతుల్యంగా ఉంచుతుంది.
  • యాపిల్ సైడర్ వెనిగర్: బరువు తగ్గించే పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్ ఒకటి. ఇది బెల్లీ ఫ్యాట్ కరిగించేందుకు, వెయిట్ లాస్‌కు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. యాపిల్ వెనిగర్‌లోని ప్రధాన పదార్ధమైన ఎసిటిక్ యాసిడ్.. జీవక్రియను పెంచడం, కొవ్వును కరిగించడం, ఆకలిని అణచివేయడం ద్వారా బరువు తగ్గడాన్ని మెరుగుపరుస్తుంది. ఎసిటిక్ యాసిడ్ బరువు పెరగడం, పొత్తికడుపు, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
  • గ్రీన్ టీ: బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఆరోగ్యకరమైన, అత్యంత ప్రభావవంతమైన పానీయాలలో ఒకటి. ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది కొవ్వును బర్న్ చేసి జీవక్రియను పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్రీన్ టీలో కెఫిన్ కూడా ఉంటుంది. ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది. దీంతోపాటు వ్యాయామం చేసేటప్పుడు తాగితే.. చురుకుదనంగా ఉంచుతుంది. ఇలా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  • నిమ్మరసం: బరువు తగ్గడానికి నిమ్మరసం ఔషధంలా పనిచేస్తుంది. నిమ్మరసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బరువు తగ్గాలనుకున్న వారు ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మకాయ నీటిని తాగడం మంచిది. నిమ్మకాయలలో విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు కొవ్వును కరిగిస్తాయి. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ ప్రక్రియ సహజంగా మెరుగుపడుతుంది.. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది.
  • గ్రేప్‌ఫ్రూట్ డిటాక్స్ వాటర్: ద్రాక్ష ఆరోగ్యకరమైన ఫ్యాట్ బర్నర్లలో ఒకటి. ఈ సిట్రస్ ఫ్రూట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ద్రాక్షకు పొట్టలోని కొవ్వును కరిగించే శక్తి ఉంది. బెల్లీ ఫ్యాట్‌ను వదిలించుకోవడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి గ్రేప్స్ జ్యూస్ తాగడం మంచిది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Avocado for Dry Hair: అవకాడోతో జట్టు సమస్యలకు చెక్.. బలమైన, మృదువైన కేశాల కోసం ఇలా చేయండి..

Tea Side Effects: ఇవి తిన్న తర్వాత ఎప్పుడూ టీ తాగవద్దు.. చాలా ప్రమాదం..