AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ ఆహారంతో చెక్ పెట్టండి..

Vitamin E Food For Dry Hair And Skin: వేసవిలో శరీరం తరచూ డీహైడ్రేషన్‌ బారిన పడుతుతుంటుంది. నీటి కొరత కారణంగా చేతులు, పాదాలు, చర్మం, పెదవులు పొడిబారిపోతాయి.

Health Tips: చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ ఆహారంతో చెక్ పెట్టండి..
Vitamin E
Shaik Madar Saheb
| Edited By: Subhash Goud|

Updated on: Apr 24, 2022 | 2:17 PM

Share

Vitamin E Food For Dry Hair And Skin: వేసవిలో శరీరం తరచూ డీహైడ్రేషన్‌ బారిన పడుతుతుంటుంది. నీటి కొరత కారణంగా చేతులు, పాదాలు, చర్మం, పెదవులు పొడిబారిపోతాయి. బలమైన సూర్యకాంతి జుట్టు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని కారణంగా జుట్టు కూడా పొడిగా.. నిర్జీవంగా మారుతుంది. వేసవిలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆహారం, తీసుకునే పానీయాలపై శ్రద్ధ వహించాలి. చర్మం, జుట్టు సమస్యలను నివారించడానికి మీరు ఆహారంలో విటమిన్ ఇ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలి. ఇవి జుట్టు, చర్మంలో తేమను ఎల్లప్పుడూ ఉంచుతాయి. విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం ద్వారా పొడిబారడం లాంటి సమస్యను తగ్గించుకోవచ్చు. విటమిన్ ఇ లోపాన్ని తగ్గించడానికి వీటిని ఎక్కువగా కొన్నింటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహార పదార్థాలు..

బాదం: బాదం విటమిన్ ఇ కి బాదం మంచి మూలం. వేసవిలో మీరు ప్రతిరోజూ 6-8 నానబెట్టిన బాదం పప్పులను తినాలి. దీని వల్ల శరీరానికి విటమిన్ ఇ పుష్కలంగా అందుతుంది. బాదంపప్పు తినడం వల్ల చర్మం, జుట్టు మృదువుగా మారుతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలు: శరీరంలో విటమిన్ ఇ లోపాన్ని నివారించడానికి మీరు తప్పనిసరిగా ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకోవాలి. ఈ విత్తనాలు తినడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం, గరుకుదనం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. విటమిన్ ఇ కోసం మీరు పొద్దుతిరుగుడు విత్తనాలను తినవచ్చు. మీరు పొద్దుతిరుగుడు నూనెను కూడా ఉపయోగించవచ్చు.

అవకాడో: విటమిన్ ఇ లోపాన్ని నివారించడానికి తప్పనిసరిగా అవకాడో తినాలి. ఈ పండు ఖరీదైనది అయినప్పటికీ.. చర్మం, జుట్టు సమస్యలను ఇది దూరం చేస్తుంది. అవోకాడోలో విటమిన్-సి కూడా ఉంటుంది. అందుకే వీటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

వేరుశెనగలు: విటమిన్ ఇ కోసం మీరు వేరుశెనగలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. వేరుశెనగను ఆహారంలో ఏ విధంగానైనా ఉపయోగించండి. వేసవిలో శనగలను నానబెట్టి లేదా.. కూర లాగా చేసుకొని తినవచ్చు. అంతే కాకుండా అన్ని సీజన్లలో కూడా వేరుశెనగలను స్నాక్స్ రూపంలో తినవచ్చు.

ఆకు కూరలు: కూరగాయల్లో, ఆకుకూరల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇందుకోసం పాలకూరను మీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోండి. ఐరన్, విటమిన్ ఇ లోపాన్ని పాలకూర తినడం ద్వారా తీర్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Belly Fat: ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్‌ హాంఫట్.. సమ్మర్‌లో ఈ పానీయాలు తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..

Avocado for Dry Hair: అవకాడోతో జట్టు సమస్యలకు చెక్.. బలమైన, మృదువైన కేశాల కోసం ఇలా చేయండి..