AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: థైరాయిడ్ సమస్యతో సతమతం అవుతున్నారా? ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!

Health Tips: హార్మోన్ల అసమతుల్యత కారణంగా థైరాయిడ్ సమస్య తలెత్తుంది. దీనికి హార్మోన్ పునఃస్థాపన చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే, మందుల వాడకం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

Health Tips: థైరాయిడ్ సమస్యతో సతమతం అవుతున్నారా? ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!
Thyroid
Shiva Prajapati
|

Updated on: Apr 24, 2022 | 6:24 PM

Share

Health Tips: హార్మోన్ల అసమతుల్యత కారణంగా థైరాయిడ్ సమస్య తలెత్తుంది. దీనికి హార్మోన్ పునఃస్థాపన చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే, మందుల వాడకం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. టాబ్లెట్లు అతిగా వాడటం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే సహజ నివారణలు పాటించడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీవన శైలిని సక్రమంగా ఉంచుకోవడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చక్కెర తక్కువగా ఉండే ఆహారం.. చక్కెర కలిగిన, ప్రాసెస్ చేసిన ఆహారాల వల్ల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ హార్మోన్ అయిన ట్రైయోడోథైరోనిన్‌గా T4 మారి.. సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. చక్కెర పదార్థాలను తినడం తగ్గించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. ఒత్తిడి దూరమవడంతో పాటు.. చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.

విటమిన్ బి.. కొన్ని విటమిన్ సప్లిమెంట్లను ఉపయోగించడం ద్వారా థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. ఇలాంటి సమయంలో విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజం వల్ల కలిగే నష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

గ్లూటెన్ లేని ఆహారం.. గ్లూటెన్ చిన్న ప్రేగులలో రోగనిరోధక ప్రతిచర్యను కలిగిస్తుంది. ఇది సెలియక్ వ్యాధికి కారణమవుతుంది. మరోవైపు, హషిమోటో థైరాయిడిటిస్, హైపోథైరాయిడిజం ఉన్న చాలా మంది వ్యక్తులు తమ డైట్ నుంచి గోధుమలు, ఇతర గ్లూటెన్ కలిగిన ఆహార పదార్థాలను తొలగించడం మేలు చేస్తుంది.

ప్రోబయోటిక్స్.. ప్రోబయోటిక్ మాత్రలలో ఉండే ప్రత్యక్ష ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మీ కడుపు, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిని సహజ పద్ధతిలోనూ తీసుకోవచ్చు. పులియబెట్టిన ఆహారాలు, పానీయాలు, కేఫీర్, కొంబుచా, కొన్ని చీజ్‌లు, పెరుగు వంటివి ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి.

గమనిక: ఈ చిట్కాలు.. మీ సమస్యను పూర్తిగా తగ్గించలేవనే విషయాన్ని గుర్తించుకోండి. నిపుణుల సలహా మేరకు వివరాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించలేదు. మీకు థైరాయిడ్ ఉందా? లేదా? అనేది వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకుని.. వైద్యుల సలహాతో చికిత్స పొందండి.

Also read:

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో భారత మార్కెట్‌లోకి 6 సరికొత్త మోడల్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Nidhhi Agerwal: ఫ్యాన్స్ చూపు తిప్పుకోనివ్వని అందాల నిధి.. ఫిదా అవుతున్న కుర్రకారు

బర్త్ డే దావత్ ఇస్తానని పిలిచి.. బాలికపై నిప్పంటించాడు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు