AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్త్ డే దావత్ ఇస్తానని పిలిచి.. బాలికపై నిప్పంటించాడు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

తన పుట్టినరోజు సందర్భంగా దావత్ ఇస్తాను. ఇంటికి రమ్మని ఓ యువకుడు పదహారేళ్ల బాలిక ఇంటికి ఆహ్వానించాడు. అతని మాటలు నమ్మిన బాలిక ఇంటికి వెళ్లింది. వెంటనే ఆ యువకుడు ఆమెకు నిప్పంటించాడు. ఆ తర్వాత తానూ నిప్పంటించుకున్నాడు....

బర్త్ డే దావత్ ఇస్తానని పిలిచి.. బాలికపై నిప్పంటించాడు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
fire
Ganesh Mudavath
|

Updated on: Apr 24, 2022 | 6:05 PM

Share

తన పుట్టినరోజు సందర్భంగా దావత్ ఇస్తాను. ఇంటికి రమ్మని ఓ యువకుడు పదహారేళ్ల బాలిక ఇంటికి ఆహ్వానించాడు. అతని మాటలు నమ్మిన బాలిక ఇంటికి వెళ్లింది. వెంటనే ఆ యువకుడు ఆమెకు నిప్పంటించాడు. ఆ తర్వాత తానూ నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ ఇద్దరు మృతి చెందారు. కేరళ(Kerala) పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్​గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం.. తన పుట్టినరోజు(Birth Day Party) ఉందంటూ ఓ బాలికను ఇంటికి పిలిచాడు. అతని మాటలను నమ్మిన ఆ బాలిక అతని ఇంటికి వెళ్లింది. ఇంటికి వచ్చిన బాలికను బాలసుబ్రమణియం గదిలోకి తీసుకెళ్లి నిప్పంటించాడు. అనంతరం తానూ నిప్పు అంటించుకున్నాడు. అదే సమయంలో ఆ ఇంట్లో యువకుడి​తల్లి, తమ్ముడు మాత్రమే ఉన్నారు. మంటలకు తాళలేక బాధితులిద్దరూ కేకలు వేయడంతో వారు చూడగా.. అప్పటికే వారి శరీరానికి మంటలు తీవ్రంగా అంటుకున్నాయి. వాటిని ఆర్పి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎర్నాకుళం (Ernakulam) లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

వారిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. వారి ప్రేమ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. ఒకరినొకరు మరిచిపోవాలని మందలించారు. వారి తీరుతో తీవ్ర మనస్తాపానికు గురైన సుబ్రమణియం.. బాలికకు నిప్పంటించి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!

GST Rates: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్‌ ఇవ్వనుందా..? ప్రజలపై మరో భారం..!