AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Rates: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్‌ ఇవ్వనుందా..? ప్రజలపై మరో భారం..!

GST Rates: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్‌ ఇవ్వనుందా ..? అంటే అనుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురవుతున్న సామాన్యుడికి..

GST Rates: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్‌ ఇవ్వనుందా..? ప్రజలపై మరో భారం..!
Subhash Goud
|

Updated on: Apr 24, 2022 | 3:48 PM

Share

GST Rates: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్‌ ఇవ్వనుందా ..? అంటే అనుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులకు గురవుతున్న సామాన్యుడికి మరో భారం కానుంది. ఒక వైపు పెట్రోల్‌, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను సైతం పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధాల (Ukraine-Russia war) కారణంగా వంట నూనె ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక తాజాగా మరోసారి ప్రజలపై ధరల పెంపు భారం పడబోతున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా వివరాలు, వివిధ నివేదికల ప్రకారం.. వస్తు సేవల పన్ను (GST) రేట్ల హేతుబద్దీకరణ ప్రతిపాదనలతో పాటు జీఎస్టీ కౌన్సిల్‌ తాజాగా 143 వస్తువులకు సంబంధించిన జీఎస్టీ రేట్ల పెంపు విషయంలో రాష్ట్రాల అభిప్రాయం కోరనుంది. దీని వల్ల ఆదాయం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే మరోసారి సామాన్యులపై భారం పడక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పెంపు జాబితాలో ఈ ప్రొడక్ట్‌లు:

పవర్‌ బ్యాంక్స్‌, వాచ్‌లు, అప్పడాలు, బెల్లం, సూట్‌ కేసులు, హ్యాండ్‌ బ్యాగ్స్‌, ఫర్‌ఫ్యూమ్స్‌, డియోండ్రెంట్స్‌, 32 ఇంచ్‌ల టీవీలు, చాక్లెట్స్‌, చూయింగ్‌ గమ్స్‌, నాన్‌ ఆల్కలిక్‌ బేవరేజెస్‌, సెరామిక్స్‌ సింక్స్‌, వాష్‌ బేసిన్స్‌, అప్పరెల్‌, క్లాథింగ్‌ యాక్ససిరీస్‌, లేదర్‌, వాల్‌నట్స్‌తో పాటు వివిధ రకాల ప్రొడక్టులు ఈ పెంపు జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో 143 రకాల వస్తువులను 18 శాతం ట్యాక్స్‌ స్లాబ్‌ నుంచి 28 శాతం ట్యాక్స్‌ స్లాబ్‌కు మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వేత్తలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

అప్పడాలు, బెల్లం వంటి ఐటమ్స్ జీరో ట్యాక్స్ నుంచి 5 శాతం ట్యాక్స్ స్లాబ్‌లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అలాగే లెదర్ అప్పరెల్ అండ్ యాక్ససిరీస్, చేతి వాచ్‌లు, రేజర్స్, పర్‌ఫ్యూమ్స్, ప్రి-షేవ్,ఆప్టర్ షేవ్ ప్రిపరేషన్స్, డెంటల్ ఫ్లోస్, చాక్లెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్, ఇంటి నిర్మాణ వస్తువులు అంటే సెరామిక్ సింక్, వాష్ బేసిన్స్, ప్లేవుడ్, డోర్స్, విండోస్, ఎలక్ట్రిక్ స్విచ్‌లు, సాకెట్స్ వంటి వాటిపై 18 శాతం పన్ను స్లాబు నుంచి 28 శాతం ట్యాక్స్ స్లాబుకు మారే అవకాశం ఉంది. వాల్‌నట్స్ జీఎస్‌టీ రేటు 5 శాతం నుంచి 12 శాతానికి పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కస్టర్డ్ పౌడర్ ట్యాక్స్ స్లాబ్ 5 శాతం నుంచి 18 శాతానికి, టేబుల్ అండ్ కిచెన్‌వేర్ వంటి వాటిపై ట్యాక్స్ రేటు 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు పంపింది. రాష్ట్రాల నుంచి అందిన సూచనలు, సలహాల మేరకు జీఎస్టీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందే ధరల మోతతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఈ వస్తువుల ధరలు పెరిగితే మరిన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Motorola G52: మోటరొలా నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఏప్రిల్‌ 25న విడుదల.. ఫీచర్స్‌.. ధర వివరాలు!

Egg Prices: రికార్డు స్థాయిలో మేతల ధరలు.. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమ..