AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!

Credit Card: చాలా మంది క్రెడిట్‌ కార్డులను వాడుతుంటారు. కానీ తెలివిగా ఉపయోగించుకుంటే మంచిది.. కానీ వాడే విధానం తెలియకపోతే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. ఆర్థిక సంస్థలు..

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!
Subhash Goud
|

Updated on: Apr 24, 2022 | 4:18 PM

Share

Credit Card: చాలా మంది క్రెడిట్‌ కార్డులను వాడుతుంటారు. కానీ తెలివిగా ఉపయోగించుకుంటే మంచిది.. కానీ వాడే విధానం తెలియకపోతే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డ్ సేవలను క్యాష్ బ్యాక్‌లు (Banks), డిస్కౌంట్‌లు (Discount), రివార్డ్ పాయింట్‌ (Reward Points)లు మొదలైన వాటి ద్వారా డబ్బును ఆదా చేయడానికి ఒక అద్భుతమైన ఆర్థిక సాధనంగా పిచ్ చేస్తాయి. అయితే క్రెడిట్ కార్డ్‌లను తెలివిగా ఎలా ఉపయోగించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాస్తవానికి, మీరు క్రెడిట్ కార్డ్‌లను తెలివిగా ఉపయోగిస్తే వడ్డీగా ఒక్క పైసా కూడా చెల్లించకుండా వాటితో అనుబంధించబడిన అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

గడువు తేదీ కంటే ముందే బిల్లు చెల్లించండి

మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు, మీ బిల్లును సకాలంలో చెల్లించినప్పుడు, మీ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడుతుంది. మీరు ఇలా చేస్తే బ్యాంకులు మీకు మెరుగైన క్రెడిట్ పరిమితులు, వ్యక్తిగత రుణాలు, మెరుగైన వడ్డీ రేట్లు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.

మీకు వీలైతే, పూర్తి బిల్లు మొత్తాన్ని చెల్లించండి

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు చేస్తున్నప్పుడు మీరు రెండు మొత్తాలను చూస్తారు. ఒకటి కనీస మొత్తం, మరొకటి పూర్తి మొత్తం. మీకు వీలైతే పూర్తి బిల్లు మొత్తాన్ని చెల్లించండి. క్రెడిట్ కార్డ్ బిల్లులపై విధించే వడ్డీ రేట్లు బ్యాంకులు మీ సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలపై చెల్లించే దాని కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే క్రెడిట్ కార్డులపై పూర్తి బిల్లు మొత్తాన్ని చెల్లించడం ఎల్లప్పుడూ మంచిది.

గ్రేస్ పీరియడ్‌ను గమనించండి

చాలా క్రెడిట్ కార్డ్‌లు బిల్లు చెల్లింపులు చేయడానికి గడువు తేదీకి మించి గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. గ్రేస్ పీరియడ్ లోపల మీరు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా చెల్లింపు చేయవచ్చు. కొన్ని కారణాల వల్ల మీరు గడువు తేదీలోపు చెల్లింపులు చేయలేకపోతే గ్రేస్ పీరియడ్‌ను గమనించండి. గ్రేస్ పీరియడ్ పరిమితిని దాటితే మీకు భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.

ఆకస్మిక కొనుగోళ్లను నివారించండి

క్రెడిట్ కార్డుల వినియోగంలో ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డులు ఉన్నవారికి ఎన్నో ఆఫర్లు జారీ చేస్తుంటారు. ఆఫర్లు వచ్చాయి కదా అని ఎడపెడ ఖర్చు చేస్తే చెల్లింపుల సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇది అధిక వ్యయం, క్రమంగా అప్పుల ఊబిలోకి దారి తీయవచ్చు. కేవలం ఆఫర్ల కోసం కొనుగోళ్లు చేయవద్దు. అవసరం అనుకుంటేనే షాపింగ్‌లు చేయాలి.

ఇ-కామర్స్ యాప్‌లలో కార్డ్‌లను సేవ్ చేయడం మానుకోండి

మీరు ఇ-కామర్స్ యాప్ లేదా పోర్టల్ ద్వారా కొనుగోలు కోసం చెల్లింపు చేసినప్పుడు అది కార్డ్ వివరాలను సేవ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. మీరు కార్డ్ వివరాలను సేవ్ చేసిన తర్వాత మీరు మళ్లీ వివరాలను నమోదు చేయవలసిన అవసరం లేదు. ఇది మీ తదుపరి కొనుగోళ్లను సులభతరం చేస్తుంది. కానీ, ఆ సౌలభ్యం హఠాత్తుగా కొనుగోళ్లకు దారి తీస్తుంది. కాబట్టి, ఇ-కామర్స్ పోర్టల్‌లలో క్రెడిట్ కార్డ్ వివరాలను సేవ్ చేయకుండా ఉండటం మంచిది.

నగదు ఉపసంహరణ

క్రెడిట్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరణలు రెండు రకాల ఛార్జీలను ఉంటాయి. ఒకటి, విత్‌డ్రా చేసిన మొత్తానికి నగదు అడ్వాన్స్ రుసుము లావాదేవీ, సేవా ఛార్జీల రూపంలో, మరొకటి ఫైనాన్స్ ఛార్జీల రూపంలో ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరించుకోవడం మానుకోండి. ఇలా చేస్తే మీరు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

మీ స్వంత పరిమితులను సెటప్ చేయండి

క్రెడిట్‌ కార్డులు వాడేముందు ఎంత ఖర్చు చేయాలనే విషయాన్ని మీరే నిర్ధారించుకోవచ్చు. ఇందుకోసం పరిమితిని సెట్‌ చేసుకోవచ్చు. దీని వల్ల పెద్ద పెద్ద కొనుగోళ్లు చేయకుండా నివారించవచ్చు. దీని వల్ల మీరు ఖర్చుల విషయంలో లిమిట్‌దాటి పోకుండా ఉంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

GST Rates: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్‌ ఇవ్వనుందా..? ప్రజలపై మరో భారం..!

Yamaha E10 Electric Scooter: యమహా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకునే శక్తి..!