AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buttermilk Side Effects: వేసవి కాలంలో చలవు కోసం మజ్జిగ తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి..

Buttermilk Side Effects: వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు జనాలు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, చల్లని నీటిని తాగడం వంటివి చేస్తుంటారు.

Buttermilk Side Effects: వేసవి కాలంలో చలవు కోసం మజ్జిగ తాగుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి..
Buttermilk
Shiva Prajapati
|

Updated on: Apr 24, 2022 | 10:16 PM

Share

Buttermilk Side Effects: వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు జనాలు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, చల్లని నీటిని తాగడం వంటివి చేస్తుంటారు. ఇక శరీర ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంచడం కోసం మజ్జిగ, కొబ్బరి బోండా తాగుతుంటారు. ఇందులో మజ్జిగను ప్రధాన డ్రింక్‌గా చెప్పొచ్చు. దీన్ని తాగడం వలన వేసవిలో చలవుగా ఉంటుందని అంతా భావిస్తారు. కానీ మజ్జిగతో మంచే కాదు.. చెడు కూడా జరుగుతుందంటున్నారు. మజ్జిగను అతిగా తీసుకున్నా, సమయం కాని సమయంలో తాగినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మజ్జిగ అతిగా తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మజ్జిగ విలువైన పోషకాలు ఉంటాయి. ఒక కప్పు(245ఎంఎల్) మజ్జిగలో 98 కేలరీలు, 8 గ్రాముల పోటీన్స్, 3 గ్రాముల ఫైబర్, 22శాతం కాల్షియం, 16శాతం సోడియం, విటమిన్ బి12 ఉన్నాయి. కానీ, మజ్జిగలో కొన్ని వ్యక్తులలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమయ్యే ఉప్పు కంటెంట్‌కు సంబంధించి అనేక ప్రతికూలతలు అందులో ఉన్నాయి. తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న మజ్జిగను తీసుకున్నప్పటికీ.. ఆ మజ్జిగలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుందని, తద్వారా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు.

మజ్జిగను ఎవరు, ఎప్పుడు తాగొద్దంటే.. జలుబు, జ్వరం, అలెర్జీ ఉన్నప్పడు రాత్రి సమయంలో మజ్జిగ అస్సలు తాగొద్దు. సమస్య ఉన్నప్పుడు మజ్జిగ తాగితే మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. పిల్లలకు మజ్జిగ ఇవ్వకూడదు. వెన్నలో హానీకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా గొంతు ఇన్‌ఫెక్షన్, జలుబుకు కారణం అవుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారు మజ్జిగకు దూరంగా ఉండాలి. మజ్జిగలో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. అది ఆరోగ్యానికి హానీ చేస్తుంది.

Also read:

Viral Video: నీటిలో సరదాగా స్విమ్మింగ్ చేస్తున్న పాము.. సడెన్‌గా దూసుకొచ్చిన మొసలి.. షాకింగ్ సీన్ చూస్తే హడలే..!

Viral Video: విమానాశ్రయంలో చిన్నారితో సరదాగా పోలీస్ ఆఫీసర్.. వీడియోకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు..!

Love Failure: ‘నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ’.. ప్రేయసికి లేఖ రాసిన యువకుడు.. చివరకు..!