Viral Video: విమానాశ్రయంలో చిన్నారితో సరదాగా పోలీస్ ఆఫీసర్.. వీడియోకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు..!
Viral Video: విమానాశ్రయంలో భద్రతా అధికారులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలసిందే. ప్రయాణికుల ముసుగులో వచ్చే స్మగ్లర్లను, సంఘ విద్రోహక శక్తులను అరికట్టేందుకు..
Viral Video: విమానాశ్రయంలో భద్రతా అధికారులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలసిందే. ప్రయాణికుల ముసుగులో వచ్చే స్మగ్లర్లను, సంఘ విద్రోహక శక్తులను అరికట్టేందుకు, వారిని అడ్డుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అయితే, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. చిన్న పిల్లలు కంటపడితే వారు కూడా చిన్న పిల్లలుగా మారిపోతారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన, ఎంతో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారి చెకింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ చిన్నారి అటుగా వచ్చింది. ఆ చిన్నారిని చూసి ఫిదా అయిపోయాడు ఆ అధికారి. చిన్నారిని ఎత్తుకుని కాసేపు సరదాగా ఆడుకున్నాడు. ఈ క్యూట్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రమ్‌లో ‘alexanderjohandabbelvenes’ పేరుతో ఉన్న యూజర్ షేర్ చేశారు. దాంతో వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.3 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా, 80వేల లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘డ్యూటీ అండ్ కేర్’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘సో స్వీట్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Viral Video:
View this post on Instagram
Also read:
Love Failure: ‘నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ’.. ప్రేయసికి లేఖ రాసిన యువకుడు.. చివరకు..!
Health Tips: థైరాయిడ్ సమస్యతో సతమతం అవుతున్నారా? ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!
Relationship: మీ బంధాన్ని తెంచుకోవాలని భావిస్తున్నారా? ఈ 5 ప్రశ్నలను మీకు మీరే వేసుకోండి..!