Relationship: మీ బంధాన్ని తెంచుకోవాలని భావిస్తున్నారా? ఈ 5 ప్రశ్నలను మీకు మీరే వేసుకోండి..!
Relationship: చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమ భాగస్వామితో కొంతకాలం కలిసి ఉన్న తరువాత విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అదే విషయాన్ని వారికి చెప్పేసి..
Relationship: చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమ భాగస్వామితో కొంతకాలం కలిసి ఉన్న తరువాత విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అదే విషయాన్ని వారికి చెప్పేసి.. దూరమైపోతుంటారు. కొందరైతే ఎలాంటి కారణం లేకుండానే తమ రిలేషన్‌షిప్‌కు గుడ్ బై చెబుతారు. మరికొందరు తమ నిర్ణయం పట్ల మదనపడిపోతుంటారు. అయితే, రిలేషన్‌షిప్‌ను తెంచుకునే ముందు.. తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనా? తప్పుడు నిర్ణయమా? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. కానీ, అంతా బాగున్నప్పటికీ.. బంధాలను తెంచుకునే ముందు ఎవరికి వారే కొన్ని ప్రశ్నలు వేసుకుంటే తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనా? కాదా? అనేది తేలుతుంది. మరి ప్రశ్నలేంటో ఒకసారి చూద్దాం..
నా భాగస్వామితో భవిష్యత్తు ఉంటుందా? భవిష్యత్తు గురించి ఆలోచించడం భయాన్ని కలిగిస్తుంది. కానీ, మీరు సరైన వ్యక్తితో ఉంటే భవిష్యత్ కూడా సరిగానే ఉంటుంది. అలాంటి వ్యక్తులతో ఉంటే.. భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరం, భయం ఉండదు. మీ భాగస్వామితో ఉంటే మీరు అనుకున్నది సాధింగలరా? మీ లైఫ్ సెక్యూర్‌గా ఉంటుందా? అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.
నేను నా భాగస్వామితో సంతోషంగా ఉన్నానా? మీరు మీ భాగస్వామితో నిజంగా సంతోషంగా ఉన్నారా అని మీరే ప్రశ్నించుకోండి. వారు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకోండి. వారు లేకుండా మీరు సంతోషంగా ఉంటారని, స్వేచ్ఛగా జీవిస్తారని భావిస్తే.. ఆ తరువాత మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు.
నా భాగస్వామి నా అవసరాలను తీరుస్తున్నాడా? అంచనాలు, అవసరాలు సంబంధంలో పెద్ద భాగం. మీ భాగస్వామి మీ కోరికలు, అవసరాలను తీరుస్తున్నారా? మీపట్ల తగినంత శ్రద్ధ వహిస్తున్నారా? అనేది ఆలోచించండి. మీరు నిర్లక్ష్యం చేయబడినట్లు, విస్మరించబడినట్లు అనిపేస్తే ఇదే విషయాన్ని మీ భాగస్వామితో చర్చించి మీ నిర్ణయాన్ని తెలుపండి.
మనం ఇంకా ఒకరినొకరు ప్రేమిస్తున్నామా? కొన్నిసార్లు.. ప్రేమ చాలా విచిత్రమైనది. మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కావున.. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇది. మీరిద్దరూ ఇప్పటికీ ఒకరినొకరు ఇష్టపడుతున్నారా? ప్రేమిస్తున్నారా? అనేది తేల్చుకోవాలి. ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లయితే.. బంధం కొనసాగించడానికి ఇంకా ఆస్కారం ఉన్నట్లే అని చెప్పొచ్చు.
ఈ నిర్ణయం నన్ను బాధిస్తుందా? జీవితంలో మార్పులు అనివార్యం. మీ నిర్ణయాలకు మీరు పశ్చాత్తాపపడే సందర్భాలు, గొప్ప వాగ్దానాలను కలిగి ఉన్న మీ జీవితంలో మార్పులను స్వాగతించే క్షణాలు ఉంటాయి. కావున.. ఒక బంధానికి ఎండ్ చెప్పడం వలన బాధ ఉండదని, మెరుగైన భవిష్యత్ కోసం ఇది తప్పదు అనుకుంటే ఈ నిర్ణయం ప్రకారం ముందుకు సాగండి.
Also read:
Hyderabad: లేత మనసుల్లో విషం చిమ్ముతున్న గలీజ్ గాళ్లు.. డబ్బులిస్తే అశ్లీల వీడియోల లింకులు
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం