AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: లేత మనసుల్లో విషం చిమ్ముతున్న గలీజ్ గాళ్లు.. డబ్బులిస్తే అశ్లీల వీడియోల లింకులు

స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లలకు పాకెట్ మనీ(Pocket Money) ఇస్తున్నారా.. అయితే జాగ్రత్త. వారు ఆ డబ్బును ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటున్నారా.. లేకపోతే అంతే సంగతులు. కరోనా పుణ్యమా అని ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యాబోధన ...

Hyderabad: లేత మనసుల్లో విషం చిమ్ముతున్న గలీజ్ గాళ్లు.. డబ్బులిస్తే అశ్లీల వీడియోల లింకులు
Cyber
Ganesh Mudavath
|

Updated on: Apr 24, 2022 | 4:40 PM

Share

స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లలకు పాకెట్ మనీ(Pocket Money) ఇస్తున్నారా.. అయితే జాగ్రత్త. వారు ఆ డబ్బును ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటున్నారా.. లేకపోతే అంతే సంగతులు. కరోనా పుణ్యమా అని ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యాబోధన జరిగింది. దీంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి సెల్ ఫోన్(Cell Phone) చేరింది. అయితే.. మీరు ఇచ్చే పాకెట్‌ మనీని మీ పిల్లలు ఏ అవసరాలకు ఖర్చు పెడుతున్నారో గమనించాలని నిపుణులు, పోలీసులు చెబుతున్నారు. పిల్లల నగ్న దృశ్యాలు, పోర్న్‌ వీడియోలతో వ్యాపారం చేసే ముఠాలు టీనేజ్‌(Teenage) పిల్లలపై వల విసురుతున్నాయి. ఇప్పటికే కొంతమంది పిల్లలు తమ పాకెట్‌ మనీతో నగ్న వీడియోలు, శృంగార వీడియోలు కొనుగోలు చేస్తున్నారు. పొద్దస్తమానం వాటినే చూస్తూ.. వాటి గురించే ఆలోచిస్తూ.. బానిసలుగా మారుతూ.. చదువులు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు ఆన్‌లైన్‌లో సైబర్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఇలాంటి ఎన్నో భయంకర విషయాలు బయటపడ్డాయి.

ఢిల్లీ, బెంగళూరు, ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ముఠాలు హైదరాబాద్‌లోని స్కూల్‌ పిల్లలనూ వీడియోలు చూసేలా పురిగొల్పి, వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన స్కూల్‌ పిల్లల ఫోన్‌ నెంబర్లను సంపాదించి, వారికి పోర్న్‌ వీడియాలను పరిచయం చేస్తున్నారు. తక్కువ ధరకే వీడియోలు పంపిస్తామని మాయమాటలు చెప్పి విషం చిమ్ముతున్నాయి. వారు పెట్టే మెసేజ్‌లకు ఆకర్షితులయ్యే పిల్లల నుంచి యూపీఐ పేమెంట్ల ద్వారా డబ్బులు తీసుకొని, వారికి అశ్లీల, నగ్న వీడియోల లింక్‌లు పంపిస్తున్నాయి. చేతిలో పాకెట్‌ మనీ ఉండటంతో పిల్లలు తేలికగా వాటి బారిన పడుతున్నారు. ఈ ముఠాలు ప్రధాన నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని, వారి ద్వారా టెలిగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి, యువతకు వల విసురుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

పోర్న్‌ వీడియో విక్రయ ముఠాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంల ద్వారా టీనేజ్‌, యువత అభిరుచులు పసిగడుతున్నాయి. నకిలీ అకౌంట్ల ద్వారా చాటింగ్‌ చేస్తూ స్నేహం పెంచుకుంటున్నాయి. కేవలం 24 గంటల్లోనే పోర్న్‌ వీడియోల ఉచ్చులోకి లాగేస్తున్నాయి. ఈ ముఠా హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంటర్‌ విద్యార్థినిని సైతం ట్రాప్‌ చేసినట్టు మహిళాభద్రత విభాగం అధికారులు సైబర్‌ పెట్రోలింగ్‌లో గుర్తించారు. ఈ విద్యార్థినికి ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇస్తూ, ఆ మైకం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎంతోమంది పిల్లలు పోర్న్‌ వీడియాలకు బానిసలుగా మారుతున్నారని ఒక పోలీసు అధికారి ఆవేదన వ్యక్తంచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also read:

PBKS vs CSK IPL 2022: పంజాబ్‌ ముందు చెన్నై రికార్డ్‌ ఎలా ఉందంటే..!

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారా..? కార్డును తెలివిగా ఉపయోగించడానికి చిట్కాలు..!