AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Failure: ‘నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ’.. ప్రేయసికి లేఖ రాసిన యువకుడు.. చివరకు..!

Love Failure: తాను ప్రేమిస్తున్న యువతికి వేరొకరితో పెళ్లి జరుగడంతో మనస్తాపానికి గురైన ప్రేమికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌లో ‘

Love Failure: ‘నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ’.. ప్రేయసికి లేఖ రాసిన యువకుడు.. చివరకు..!
Love
Shiva Prajapati
|

Updated on: Apr 24, 2022 | 6:42 PM

Share

Love Failure: తాను ప్రేమిస్తున్న యువతికి వేరొకరితో పెళ్లి జరుగడంతో మనస్తాపానికి గురైన ప్రేమికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌లో ‘ నా చావు నీ పెళ్లి కానుక. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’ అంటూ రాశాడు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బలోద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బలోద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. తమ గ్రామానికే చెందిన యువతిని ప్రేమించాడు. అయితే, యువతికి ఆమె కుటుంబ సభ్యులు వేరొకరితో వివాహం నిశ్చయించడంతో.. ఆమెకు పెళ్లి జరిగింది. అయితే, తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో వివాహం జరగడాన్ని తట్టుకోలేకపోయిన యువకుడు.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు ముందు ఒక లేఖ రాశాడు. ‘నా చావు నీ పెళ్లి కానుక. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’ అని లేఖలో పేర్కొన్నాడు. అదే సమయంలో తాను ఉరి వేసుకుంటున్నట్లు ఫోన్‌లో వీడియో తీసి వాట్సప్ స్టేటస్ పెట్టాడు. అనంతరం ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుడికి ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను చనిపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలం కారణంగానే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని బలోద్ డీఎస్పీ ప్రతీక్ చతుర్వేది తెలిపారు.

Also read:

PAN Card Uses: పాన్‌ కార్డు ఉపయోగం ఏమిటి..? ఏయే వాటికి అవసరం.. పూర్తి వివరాలు

Health Tips: థైరాయిడ్ సమస్యతో సతమతం అవుతున్నారా? ఈ 5 విషయాలపై ఓ లుక్కేయండి..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో భారత మార్కెట్‌లోకి 6 సరికొత్త మోడల్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?