PAN Card Uses: పాన్‌ కార్డు ఉపయోగం ఏమిటి..? ఏయే వాటికి అవసరం.. పూర్తి వివరాలు

PAN Card Uses: పాన్‌ కార్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌ ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్‌ బ్యాంకు అకౌంట్‌ తీయడం నుంచి వివిధ రకాల లావాదేవీల..

PAN Card Uses: పాన్‌ కార్డు ఉపయోగం ఏమిటి..? ఏయే వాటికి అవసరం.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2022 | 6:31 PM

PAN Card Uses: పాన్‌ కార్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌ ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్‌ బ్యాంకు అకౌంట్‌ తీయడం నుంచి వివిధ రకాల లావాదేవీలకు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. పాన్‌ కార్డు లేనిది బ్యాంకు అకౌంట్‌ (Bank Account) తీయడం, లావాదేవీలు జరపడానికి వీలుండదు. గతంలో పాన్‌ కార్డు కొన్ని పరిస్థితుల్లో అవసరం ఉండగా, ఇప్పుడు నిబంధనలు మరింత కఠనతరం అయ్యాయి. ఆస్తులకు సంబంధించిన వాటికి కూడా పాన్‌కార్డు కావాల్సిందే. లేకపోతే పనులు జరగవు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పువచ్చు. మరి పాన్‌కార్డు ఏయే లావాదేవీల్లో అవసరం ఉంటుందో తెలుసుకుందాం.

☛ టూవీలర్ మినహా ఇతర వాహన కొనుగోలు లేదా అమ్మకానికి పాన్ కార్డు ఇవ్వాలి.

☛ బ్యాంకుల్లో అకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటే పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే.

☛ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇది ఉండాల్సిందే.

☛ డీమ్యాట్ అకౌంట్ తెరవాలన్నా పాన్ తప్పనిసరి.

☛ హోటల్ లేదా రెస్టారెంట్‌లో బిల్లు పేమెంట్ రూ.50 వేలకుపైగా దాటి నగదు చెల్లింపులు నిర్వహిస్తే.. పాన్ కార్డు నెంబర్ చెప్పాల్సి ఉంటుంది.

☛ ఫారిన్ కరెన్సీ కొనుగోలు సమయంలో రూ.50 వేలకు పైన నగదు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే పాన్ నెంబర్‌ ఉండాల్సిందే.

☛ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం అవుతుంది.

☛ కంపెనీ డిబెంచర్లు లేదా బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి.

☛ ఆర్‌బీఐ బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు పైన లావాదేవీలు జరిపితే పాన్‌ నెంబర్‌ తప్పకుండా అవసరం.

☛ ఒక రోజులో బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది.

☛ బ్యాంక్‌లో చెక్ ద్వారా లేదా నగదు రూపంలో ఒక రోజులో రూ.50 వేలకు పైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి.

☛ ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు రూ.50 వేలు దాటితే పాన్ నెంబర్ ఇవ్వాలి.

☛ షేర్లు కాకుండా ఇతర సెక్యూరిటీస్ కొనుగోలు సమయంలో లావాదేవీ విలువ రూ.లక్ష దాటితే పాన్ కార్డు అవసరం అవుతుంది.

☛రూ.10 లక్షలకు పైన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సి వస్తే పాన్‌ తప్పకుండా అవసరమే.

☛ వస్తువుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ నెంబర్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది.

అలా ఇన్ని అవసరాలకు పాన్‌ కార్డు తప్పకుండా అవసరం ఉంటుంది. అందుకే అధికారులు పాన్‌ కార్డు తీసుకోవాలని పదేపదే చెబుతుంటారు. ఒకప్పుడు పాన్‌ కార్డు కావాలంటే దాదాపు 45 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు పది నిమిషాల్లోనే కార్డు ప్రింట్‌ తీసుకుని అప్పటి అవసరానికి వాడుకోవచ్చు. కానీ ఒరిజినల్‌ కార్డు కావాలంటే వారం రోజుల్లో వస్తుంది. పాన్‌ నెంబర్‌తో బ్యాంకు ఖాతాకు సంబంధించిన పూర్తి లావాదేవీల వివరాలు తెలిసిపోతాయి. అలాగే పాన్‌ కార్డు బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం తప్పనిసరి. లేకపోతే జరిమానా విధిస్తారు.

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?