Avocado for Dry Hair: అవకాడోతో జుట్టు సమస్యలకు చెక్.. బలమైన, మృదువైన కేశాల కోసం ఇలా చేయండి..
Avocado for Dry Hair: ఎండాకాలంతోపాటు.. పలు సీజన్లలో పొడి జుట్టు సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.
Avocado for Dry Hair: ఎండాకాలంతోపాటు.. పలు సీజన్లలో పొడి జుట్టు సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. దీంతోపాటు చివర్లు చీలిపోవడం, జుట్టు చిట్లడం వంటి సమస్య ఎదురవుతుంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. ఇది మీ జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. మృదువైన జుట్టు కోసం మీరు అవకాడోను ఉపయోగించవచ్చు. ఇది డీప్ కండిషనింగ్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు చాలా (soft and shiny hair) ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అవకాడోను ఉపయోగించి అనేక రకాల హెయిర్ మాస్క్‌లను కూడా తయారు చేసుకోవచ్చు. వాటిని ఇంట్లో తయారు చేయడం చాలా సులభం. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి. జుట్టుకు అవకాడోను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం .
- అవోకాడో గుజ్జు: ముందుగా అవకాడోను సగానికి కోయండి. దాని విత్తనాలను తొలగించండి. అనంతరం ఫోర్క్‌తో మెత్తగా చేయాలి. పేస్ట్ లాగా మారిన తర్వాత వెంట్రుకలు కాస్త తడిగా చేసి.. అప్లై చేయండి. ఆ తర్వాత వేళ్లతో తలను కాసేపు మసాజ్ చేయండి. అనంతరం ఒక గంటపాటు అలాగే ఉంచి.. తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. మీరు దీన్ని వారానికి 2 సార్లు ఉపయోగించవచ్చు.
- అవోకాడో – పెరుగు హెయిర్ మాస్క్: ముందుగా పండిన అవకాడోను తీసుకోండి. దానిని సగానికి కట్ చేయండి. గుజ్జు తీసి దానికి 2 నుంచి 3 చెంచాల పెరుగు కలపండి. ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు మీద అప్లై చేయండి. దీన్ని జుట్టు, స్కాల్ప్ అంతా అప్లై చేసి మసాజ్ చేయండి. దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. మీరు దీన్ని వారానికి 1 నుంచి 2 సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- అవోకాడో – బనానా హెయిర్ మాస్క్: దీని కోసం అవోకాడోను సగానికి కట్ చేసి బ్లెండర్లో వేయండి.. దీని తరువాత అరటిపండు తొక్క తీసి.. దానిని కూడా ముక్కలుగా చేసి బ్లెండర్లో వేసి.. మిక్స్ చేయండి. మెత్తగా మారిన తర్వాత ఈ గుజ్జును జుట్టు, తలకు పట్టించండి. కాసేపు మసాజ్ చేసి గంటపాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. మీరు దీన్ని వారానికి 1 నుంచి 2 సార్లు ఉపయోగించవచ్చు.
- అవోకాడో – ఆలివ్ ఆయిల్: పండిన అవోకాడో తీసుకోండి. దానిని సగానికి కట్ చేసి గుజ్జు తీయండి. దానికి 1 నుంచి 2 టీస్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ కలపండి. అనంతరం మెత్తగా చేసి ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు, తలపై అప్లై చేయండి. కాసేపు మసాజ్ చేసి గంటపాటు ఉంచి తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. మీరు దీన్ని వారానికి 1 నుంచి 2 సార్లు ఉపయోగించవచ్చు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: