Tea Side Effects: ఇవి తిన్న తర్వాత ఎప్పుడూ టీ తాగవద్దు.. చాలా ప్రమాదం..

Tea Side Effects: ఫుడ్‌ కాంబినేషన్‌లో చాలామంది కొన్ని తప్పులు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. కొంతమంది టీ తాగిన తర్వాత కొన్నిరకాల ఆహార

Tea Side Effects: ఇవి తిన్న తర్వాత ఎప్పుడూ టీ తాగవద్దు.. చాలా ప్రమాదం..
Tea Side Effects
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Apr 24, 2022 | 8:16 AM

Tea Side Effects: ఫుడ్‌ కాంబినేషన్‌లో చాలామంది కొన్ని తప్పులు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. కొంతమంది టీ తాగిన తర్వాత కొన్నిరకాల ఆహార పదార్థాలని తింటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. టీ రుచి బాగానే ఉంటుంది. కానీ దాని సైడ్‌ ఎఫెక్ట్స్‌ చాలా ఘోరంగా ఉంటాయి. టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం సమస్యల బారిన పడుతారు. పరగడుపున టీ తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. కొన్ని పదార్థాలు తిన్న తర్వాత టీ తీసుకోకపోవడం మంచిది. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.

చల్లటి పదార్థాలు తిన్న తర్వాత టీ తాగకూడదు

చల్లటి పదార్థాలు తిన్న తర్వాత టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం ఉంటుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అంతే కాదు దంతాల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిజానికి చల్లటి పదార్థాలు తిన్న తర్వాత వేడి టీ తాగడం వల్ల దంతాలు జలదరిస్తాయి. అలాగే చిగుళ్లు బలహీనపడవచ్చు. మీరు ఏదైనా చల్లటి ఆహారాలు తిన్న తర్వాత టీ తాగాలనుకుంటే అరగంట గ్యాప్ తీసుకోండి.

నిమ్మరసం తాగిన తర్వాత టీ తాగకూడదు

బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే వేడినీటిలో నిమ్మరసం కలుపుకొని తాగుతారు. అయితే దీని తర్వాత టీ తాగడం తప్పు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఉబ్బరం, ఆమ్లత్వం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మకాయలో ఉండే యాసిడ్, టీ కలయిక కడుపుని దెబ్బతీస్తుంది. మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

పకోడి తిన్న తర్వాత టీ తాగకూడదు

చాలా సార్లు ప్రజలు ఇంట్లో తయారుచేసిన చిరుతిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంతమంది పకోడీలు తిన్న వెంటనే టీ తాగడానికి ఇష్టపడతారు. శనగపిండితో చేసిన వాటిని తిన్న తర్వాత టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం ఉంటుంది. శనగపిండితో చేసిన పదార్థాలు తిన్న 40 నిమిషాల తర్వాత టీ తాగితే మంచిది.

ఆకలిగా ఉన్నప్పుడు టీ తాగకూడదు

మనలో కొంత మంది ఆకలిగా ఉన్నప్పుడు టీ తాగుతుంటారు. దీనివల్ల ఆకలి వెంటనే తగ్గిపోతుంది. అయితే ఖాళీ కడపుతో టీ తాగితే హృదయ స్పందన రేటులో మార్పు చోటు చేసుకుంటుంది. దీనికి కారణంగా టీ పౌడర్‌లో ఉండే కెఫిన్‌ శరీరంలో చాలా వేగంగా కరిగిపోతుంది. దీంతో రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది హృదయంపై ప్రభావం చూపుతుంది. ఇది కాలక్రమేణా హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

NEP 2020: ఆ రాష్ట్రంలో ఇక ఎంఫిల్‌ చదువులకి స్వస్తి.. బీఈడీ కోర్సు నాలుగు సంవత్సరాలు..!

CRIS Recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త.. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ నుంచి నోటిఫికేషన్..

Ice Facial Side Effects: ఐస్‌ ఫేషియల్‌ ట్రై చేస్తున్నారా.. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి..!

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!