Ice Facial Side Effects: ఐస్ ఫేషియల్ ట్రై చేస్తున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి..!
Ice Facial Side Effects: ఎండాకాలం ఐస్ ఫేషియల్ చాలామంది ప్రయత్నిస్తారు. కానీ సరైన పద్దతిలో చేయకపోతే ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది. మంచు
Updated on: Apr 23, 2022 | 4:46 PM

ఎండాకాలం ఐస్ ఫేషియల్ చాలామంది ప్రయత్నిస్తారు. కానీ సరైన పద్దతిలో చేయకపోతే ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది. మంచు ముక్క వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. కానీ దానికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం.

పొడి చర్మం: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఐస్ క్యూబ్స్ చర్మంపై ఎక్కువసేపు రుద్దితే చర్మం పొడిబారుతుంది. అంతే కాదు ఎక్కువ సేపు రుద్దడం వల్ల రంధ్రాలు కూడా బాగా దెబ్బతింటాయి.

దురద: వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చర్మంపై ఐస్‌ను రుద్దడం అలవాటు చేసుకున్న వారికి ఒక్కోసారి దద్దుర్లు లేదా దురద సమస్య వస్తుంది.

తలనొప్పి: సున్నిత చర్మం ఉన్నవారు బయట తిరిగి వచ్చి చర్మంపై ఐస్‌ని అస్సలు రుద్దకూడదు. ఇలా చేస్తే తలనొప్పి వేధిస్తుంది. సెల్ డ్యామేజ్ వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పద్ధతిని అనుసరించండి: చర్మం ఆరోగ్యంగా మెరిసేలా చేయడానికి ఐస్‌ని టొమాటో రసంతో కలిపి ఫేస్‌కి అప్లై చేయండి. కేవలం ఒక నిమిషం పాటు రుద్దాలి. కొద్దిసేపు మసాజ్ చేయాలి.



