Rajitha Chanti |
Updated on: Apr 23, 2022 | 8:42 PM
పాలలో చెక్కెర కాకుండా.. మరికొన్ని ఇతర పదార్థాలను కలిపి తీసుకోవచ్చు.. పాలల్లో గుల్కంద్ వేసుకుని తాగడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకోండి..
ఒత్తిడి దూరమవుతుంది: పనిభారం, బాధ్యత కారణంగా ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. గుల్కంద్ పాలు తాగడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది నరాలకు ఉపశమనం ఇస్తుంది.
కళ్ళకు: పాలు శరీరానికి మేలు చేస్తున్నారు. గుల్కంద్ కలిపిన పాలు తాగడం వలన కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే కంటి చూపు పెరుగుతుందని అంటున్నారు నిపుణులు.
మలబద్ధకం: గోరువెచ్చని పాలు తీసుకోవడం కడుపు సమస్యలను తగ్గిస్తుంది. గుల్కంద్ కలిపిన పాలు తాగితే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.. గుల్కంద్‌లో ఉండే మెగ్నీషియం మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
అల్సర్ల నుంచి ఉపశమనం: కడుపు శుభ్రం చేయడానికి, ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో గుల్కంద్ కలిపి తీసుకోవాలి.. పరిమిత పరిమాణంలో మాత్రమే దీన్ని తినండి. కడుపు, అల్సర్ల సమస్య తగ్గుతుంది.
Gulkand Milk Benefits: పాలల్లో గుల్కంద్ వేసుకుని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు..