Hyderabad: ఆఫీస్ కు వెళ్లాల్సిన పని లేదు.. బాస్ ల ఒత్తిడి అసలే ఉండదు.. దూసుకుపోతున్న నయా ట్రెండ్
ఆఫీస్(Office) ల మాటే లేదు. పలానా టైమ్ లోనే పని చేయాలన్న రూలేం లేదు. పని ఎందుకు తొందరగా కాలేదన్న ఒత్తిడులు అసలే ఉండవు. ఊరించింది చాల్లే గానీ.. అసలు విషయం చెప్పండి అంటారా.. అదేం లేదండి. ఇవన్నీ ఫ్రీ లాన్సింగ్...
ఆఫీస్(Office) ల మాటే లేదు. పలానా టైమ్ లోనే పని చేయాలన్న రూలేం లేదు. పని ఎందుకు తొందరగా కాలేదన్న ఒత్తిడులు అసలే ఉండవు. ఊరించింది చాల్లే గానీ.. అసలు విషయం చెప్పండి అంటారా.. అదేం లేదండి. ఇవన్నీ ఫ్రీ లాన్సింగ్(Freelancing) చేసేవాళ్లకు ఉండే సదుపాయాలు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సమయంలో పని చేసుకోవచ్చు. కరోనా వచ్చిన తర్వాత ఈ అధికమైంది. ఇది వరకూ ఫ్రీలాన్సర్లు అంటే ఒకే రంగానికి సంబంధించిన పనులు చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకేసారి వేర్వేరు సంస్థల కోసం ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. టెక్నాలజీపై(Technology) పట్టు, వివిధ అంశాలపై అవగాహన ఉన్న వారు ఫ్రీ లాన్సింగ్ చేస్తూ లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ నైపుణ్యం ఉన్నవారికి కంటెంట్ రైటింగ్, ట్రాన్స్ లేషన్, వీడియో ఎడిటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు లభించాయి. వ్యాపార సంస్థల వ్యాపారాలు విస్తరించేందుకు సూచనలు చేశారు. వెబ్‌సైట్ డిజైనింగ్, డేటా ఎంట్రీ వంటి మార్గాల్లో మంచి ఆదాయం పొందారు.
ఒకే రంగానికి పరిమితమవకుండా ఇతర ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాను. ఈ విధానం ఐటీ వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కరోనాతో ఆఫీస్ లు బంద్ అయ్యాయి. వర్క్ ఫ్రం హోం చేసుకునే వెసులుబాటు కల్పించాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఫ్రీలాన్సర్లుగా మారిపోయారు. ఐటీ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, వీడియో ఎడిటింగ్, మార్కెటింగ్, ట్రావెల్ నిపుణులు, ఫుడ్ బ్లాగర్, యాప్‌ల తయారీ వంటి అనేక రంగాల్లో అవకాశాలున్నట్లు ఫ్రీలాన్సర్లు చెబుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read: Telangana: వెంబడించారు.. కళ్లలో కారం కొట్టారు.. నగదు బ్యాగ్ లాక్కున్నారు.. కట్ చేస్తే..