IPL 2022: కెప్టెన్ పిలిస్తే ఊపుకుంటూ పోవడమేనా? కుల్దీప్‌ని మెడపట్టి క్రీజులోకి పంపిన చాహల్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
DC vs RR IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ (Rajasthan Royals) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
DC vs RR IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ (Rajasthan Royals) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ థ్రిల్లింగ్ పోరు (DC vs RR) లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 222 పరుగుల భారీస్కోరు సాధించింది. జోస్ బట్లర్ లీగ్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పటికీ పంత్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్ చలవతో మళ్లీ పోటీలోకి వచ్చింది. ముఖ్యంగా పావెల్ తన విధ్వసంకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో ఇరు జట్లలోని కొంతమంది ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయారు. ముఖ్యంగా ఢిల్లీ ఆటగాళ్లు పంత్, శార్దూల్ ఠాకూర్‌లు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
నువ్వా- నేనా అంటూ!
ఇంతకీ ఏం జరిగిందంటే.. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఢిల్లీకి ఆఖరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమయ్యాయి. మెక్ కాయ్ వేసిన ఆ ఓవర్‌లో మొదటి మూడు బంతులు సిక్సర్లుగా మలిచాడు రోవ్‌మన్ పావెల్. అయితే మెక్ కాయ్ వేసిన నాలుగో బంతి నడుం కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించకపోవడంతో రగడ ప్రారంభమైంది. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురైన పంత్, శార్దూల్ డగౌట్‌లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రావల్సిందిగా సైగలు చేశాడు. దీంతో పావెల్‌తో పాటు క్రీజ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ మైదానం విడిచే ప్రయత్న చేశాడు. ఇది గమనించిన ఆర్‌ఆర్ బౌలర్ చాహల్ కుల్దీప్‌ను అడ్డుకున్నాడు. ‘కెప్టెన్ పిలిస్తే ఊపుకుంటూ పోతావా. క్రీజ్‌లోకి పో’ అంటూ మెడ పట్టుకుని పిచ్‌పైకి తోసేశాడు. అయితే ఇది సరదాగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. కాగా ఈ టోర్నీలో చాహల్, కుల్‌దీప్ అమోఘంగా రాణిస్తున్నారు. స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ పర్పుల్ క్యాప్ రేసులో నువ్వా-నేనా అంటూ పోటీపడుతున్నారు. ఈక్రమంలో క్రికెట్ అభిమానులు వీరిద్దరిని కుల్చా (కుల్‌దీప్, చాహల్) అని సరదాగా పిలుస్తున్నారు.
Chahal ? pic.twitter.com/W8PFdaVTYY
— ?????? (@Oyye_Mr) April 22, 2022
Also Read: RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..
Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్