IPL 2022 Points Table: తగ్గేదేలే.. రెండో స్థానానికి దూసుకొచ్చిన హైదరాబాద్.. టాప్‌లో ఎవరున్నారంటే..

IPL 2022: ఐపీఎల్-2022 (IPL 2022) ఏ జట్టును తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. బలహీనంగా కనిపించే జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థుల పని పడుతున్నాయి.

IPL 2022 Points Table: తగ్గేదేలే.. రెండో స్థానానికి దూసుకొచ్చిన హైదరాబాద్.. టాప్‌లో ఎవరున్నారంటే..
Ipl 2022
Follow us
Basha Shek

|

Updated on: Apr 24, 2022 | 6:04 AM

IPL 2022: ఐపీఎల్-2022 (IPL 2022) ఏ జట్టును తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. బలహీనంగా కనిపించే జట్లు కూడా అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థుల పని పడుతున్నాయి. ఐపీఎల్- 2022 మెగా వేలం తర్వాత గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లపై పలు అనుమానాలు తలెత్తాయి. స్టార్‌ ఆటగాళ్లు లేకపోవడంతో ఆ రెండు జట్లను బలహీనంగా ఉన్నాయన్నారు చాలామంది. అయితే లీగ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి ఆ రెండు టీంలే మొదటి రెండు స్థానాల్లో ఉండడం ఆశ్చర్యకరం. శనివారం కేకేఆర్‌ (KKR vs GT)తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని టైటాన్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మరోవైపు పటిష్ఠమైన బెంగళూరు(RCB vs SRH)పై 9 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో రెండో ప్లేసులోకి ఎగబాకింది. బెంగళూరుపై గెలుపుతో ఆ జట్టు రన్‌రేట్‌ కూడా భారీగా మెరుగుపడింది.

ఐపీఎల్‌ పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే..

1. గుజరాత్ టైటాన్స్‌ ( 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) – 12 పాయింట్లు

2. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ( 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు)- 10

3. రాజస్థాన్‌ రాయల్స్‌ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) – 10

4. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు)- 10

5. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు)- 8

6. ఢిల్లీ క్యాపిటల్స్‌ ( (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) -6

7. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు)- 6

8. పంజాజ్‌ కింగ్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) – 6

9. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు)-4

10. ముంబై ఇండియన్స్‌ – (7 మ్యాచ్ ల్లో 0 విజయాలు)- 0

Also Read: Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Digital News Round Up: పవన్‌ టూర్‌ లో జగన్‌ భజన || టీ తాగడం కోసం ట్రైన్ ఆపిన డ్రైవర్..లైవ్ వీడియో

Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్