Viral Photo: ఈ ఫోటోలో ఓ తప్పుంది.! అదేంటో చెప్పగలరా.. గుర్తిస్తే మీరే జీనియస్!

మీకు కాఫీ తాగకపోతే రోజు గడవదా.? సాధారణంగా చాలామందికి ఉదయాన్నే కాఫీ తాగకపోతే రోజు మొదలవదు...

Viral Photo: ఈ ఫోటోలో ఓ తప్పుంది.! అదేంటో చెప్పగలరా.. గుర్తిస్తే మీరే జీనియస్!
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 23, 2022 | 7:54 PM

మీకు కాఫీ తాగకపోతే రోజు గడవదా.? సాధారణంగా చాలామందికి ఉదయాన్నే కాఫీ తాగకపోతే రోజు మొదలవదు. ప్రతీ ఒక్కరికి కాఫీ అనేది ఇన్‌స్టాంట్ ఎనర్జీ బూస్టర్ లాంటిది. అలాంటి ఓ ఫిల్టర్ కాఫీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలెందుకు ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? హా! చూశాం ఏముంది.. గ్లాస్‌లో ఫిల్టర్ కాఫీ పొగలు కక్కుతోంది అని అనుకుంటే పొరపాటు. సరిగ్గా చూడండి.. అందులో ఉన్న మర్మం మీకు అర్ధమవుతుంది. చెన్నైకి చెందిన ఓ పెయింట్ ఆర్టిస్ట్ ఈ ఫోటోను తన ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. ఏంటి.! ఆ ఫోటోలో తప్పును కనిపెట్టారా.? జూమ్ చేయండి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆ మ్యాజిక్ తెలిసిందా.? అవునండీ అదొక పెయింటింగ్. కానీ రియలిస్టిక్ ఫీల్ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆ ఫోటోను చూసినప్పుడు మొదటిగా దీన్ని చాలామంది నమ్మలేదు. అయితే జూమ్ చేసి చూశాక వారికి అర్ధమైంది. అది నిజంగా పెయింటింగ్ అని.

కాగా, ఈ పోస్టును వరుణ అనే నెటిజన్ ట్విట్టర్‌లో చేయగా.. దీనికి ఇప్పటివరకు 45 వేలకు పైగా లైకులు, 5 వేల రీ-ట్వీట్లు వచ్చాయి. అలాగే ఎంతోమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్స్‌లో పెయింట్ చేసిన వ్యక్తిని అభినందిస్తున్నారు.