- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 kkr superman rinku singh take 4 catch against gujarat titans
IPL 2022: ఒక్క మ్యాచ్ ఆడి ‘సూపర్ మ్యాన్’ అయ్యాడు.. ఎవరో తెలుసా..?
IPL 2022: ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు అతడు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. కానీ అందరూ ప్రశంసిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయినా అతడి గురించే
Updated on: Apr 24, 2022 | 5:49 PM

ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు అతడు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. కానీ అందరూ ప్రశంసిస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయినా అతడి గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ ఎవరు అతడు అనుకుంటున్నారా.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రింకూ సింగ్. దేశవాళీ క్రికెట్‌లో యూపీకి ప్రాతినిధ్యం వహించిన రింకూ సింగ్ శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ఓడిపోయినా రింకూ సింగ్ తన చురుకుదనంతో అందరి ప్రశంసలు పొందాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రింకూసింగ్ 4 క్యాచ్‌లు పట్టాడు. అందులో 3 క్యాచ్‌లు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పట్టాడు. దీంతో ఈ సీజన్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు.

ఐపీఎల్ 2022లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 7 మ్యాచ్‌ల్లో 7 క్యాచ్‌లు అందుకున్నాడు. కానీ రింకూ సింగ్ కేవలం ఒక మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు పట్టడం ద్వారా అతడికి సవాలు విసిరాడు. KKR అతడికి కొన్ని మ్యాచ్‌లలో అవకాశాలు ఇస్తే అతను అత్యధిక క్యాచర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.



