IPL 2022: అభిమానుల మనుసు దోచుకున్న యూపీ వాలా.. కేవలం ఒక్క మ్యాచ్‌తో ‘సూపర్‌మ్యాన్’గా మారాడు.. అతనెవరంటే?

హైట్‌లో తక్కువే, కానీ తన చురుకుదనంతో యూపీకి చెందిన రింకూ సింగ్ క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అయినా..

Venkata Chari

|

Updated on: Apr 24, 2022 | 9:18 PM

ఐపీఎల్ 2022లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న లిస్టులో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో 7 క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే, రింకూ సింగ్ కేవలం ఒక మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు పట్టడం ద్వారా కేన్‌మామకు సవాలు విసిరాడు. కోల్‌కతా ఈ యంగ్ ప్లేయర్‌కు తదుపరి మ్యాచ్‌లలో మరిన్ని అవకాశాలు ఇస్తే, అత్యధిక క్యాచర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవచ్చు.

1 / 4
యూపీకి చెందిన రింకూ సింగ్.. ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. ఈ ఆల్ రౌండర్ దేశవాళీ క్రికెట్‌లో యూపీకి ప్రాతినిధ్యం వహించిన రింకూ సింగ్ శనివారం గుజరాత్ టైటాన్స్‌తో కేకేఆర్ తరపున తన తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ఓడిపోయినా రింకూ సింగ్ తన చురుకుదనంతో సూపర్‌మ్యాన్‌గా మారాడు.

2 / 4
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 4 క్యాచ్‌లు పట్టుకున్నాడు. అందులో 3 క్యాచ్‌లు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రావడం విశేషం. దీంతో ఈ సీజన్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 క్యాచ్‌లు తీసుకున్న అతను ఈ విషయంలో కోల్‌కతాకి చెందిన తన సొంత సహచరుడు టిమ్ సౌతీని వెనక్కునెట్టాడు.

3 / 4
ఐపీఎల్ పిచ్ నుంచి మైదానంలోని ప్రతి మూల వరకు, ప్రతిచోటా తన ఉనికిని చాటుకున్నాడు. ఎత్తు ఎక్కువ కాదు, కానీ చురుకుదనంతో, ఈ ప్లేయర్ క్రికెట్ అభిమానుల మొప్పును పొందాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. కానీ అందరూ అతని ప్రతిభకు ఫిదా అయ్యారు. ఆ మ్యాచ్‌లో జట్టు ఓడిపోయినా.. ఈ యూపీ ప్లేయర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్ 2022లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా రింకూ సింగ్ నిలిచాడు.

4 / 4
Follow us