AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: లక్నో సారథితో ముంబైకు అట్లుంటది మరి.. ఆ రికార్డులో తొలి బ్యాట్స్‌మెన్‌‌గా కేఎల్ రాహుల్..

వాంఖడే స్టేడియంలో రాహుల్ 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. 62 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు.

IPL 2022: లక్నో సారథితో ముంబైకు అట్లుంటది మరి.. ఆ రికార్డులో తొలి బ్యాట్స్‌మెన్‌‌గా కేఎల్ రాహుల్..
Ipl 2022 Kl Rahul
Venkata Chari
|

Updated on: Apr 24, 2022 | 9:50 PM

Share

ఐపీఎల్ 2022 (IPL 2022) ముంబై ఇండియన్స్‌కు మరోసారి అంతగా కలిసిరాలేదు. కేఎల్ రాహుల్(KL Rahul) ఈ జట్టును మరింత ఇబ్బంది పెడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్ ముంబైపై తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు. మరోసారి రోహిత్ శర్మ జట్టును చిత్తు చేసి అద్భుతమైన సెంచరీని సాధించాడు. 8 రోజుల క్రితం రాహుల్ ముంబై ఇండియన్స్‌పై 103 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విధంగా ఐపీఎల్ 2022లో రాహుల్ రెండో సెంచరీ సాధించగా, ముంబైపై మూడోసారి ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు.

లక్నో, ముంబై మధ్య ఈ సీజన్‌లో ఇది రెండవ ఎన్‌కౌంటర్. ఈ సీజన్‌లోని 37వ మ్యాచ్‌లో ఆదివారం ఏప్రిల్ 24 వాంఖడే స్టేడియంలో ముఖాముఖిగా తలపడ్డాయి. రెండు సార్లు రాహుల్ దాడులను ముంబై ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈసారి ముంబై మెరుగ్గా బౌలింగ్ చేసి లక్నోను సునాయాసంగా పరుగులు చేసేందుకు అనుమతించలేదు. అయితే ఈ సీజన్‌లో రెండో సెంచరీ సాధించిన లక్నో కెప్టెన్ రాహుల్‌ను ఆపలేకపోయారు. వాంఖడే స్టేడియంలో రాహుల్ 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. 62 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు.

కేఎల్ రాహుల్‌కి ఇది మూడో సెంచరీ కాగా, ఈ సెంచరీతో రాహుల్ ప్రత్యేక రికార్డు కూడా సృష్టించాడు. ఐపీఎల్‌లో ఒకే జట్టుపై మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2019లో తొలిసారిగా ముంబైపై పంజాబ్ తరపున రాహుల్ సెంచరీ సాధించాడు. ఆ సెంచరీ కూడా వాంఖడేలోనే వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 16న ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల తొలి పోరులో రాహుల్ 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Also Read: IPL 2022: అభిమానుల మనుసు దోచుకున్న యూపీ వాలా.. కేవలం ఒక్క మ్యాచ్‌తో ‘సూపర్‌మ్యాన్’గా మారాడు.. అతనెవరంటే?

LSG vs MI Score: మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించిన రాహుల్‌.. ముంబై టార్గెట్‌ 169 పరుగులు..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..