Viral Video: ప్లాట్ ఫాంపై దూసుకొచ్చిన రైలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

రైల్వేస్టేషన్ లో పట్టాలపై రైళ్లు ఉంటాయి. ప్రయాణికులు ప్లాట్ ఫాంపై రైలు కోసం ఎదురు చూస్తుంటారు. ఇది సర్వసాధారణం. అయితే రైలు కోసం ప్లాట్ ఫాం(Plat Form) పై ఎదురుచూస్తు్న్న సమయంలో.. అదే ప్లాట్ ఫాం పై రైలు దూసుకొస్తే...

Viral Video: ప్లాట్ ఫాంపై దూసుకొచ్చిన రైలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
Chennai Train
Follow us

|

Updated on: Apr 24, 2022 | 7:09 PM

రైల్వేస్టేషన్ లో పట్టాలపై రైళ్లు ఉంటాయి. ప్రయాణికులు ప్లాట్ ఫాంపై రైలు కోసం ఎదురు చూస్తుంటారు. ఇది సర్వసాధారణం. అయితే రైలు కోసం ప్లాట్ ఫాం(Plat Form) పై ఎదురుచూస్తు్న్న సమయంలో.. అదే ప్లాట్ ఫాం పై రైలు దూసుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. ప్లాట్ ఫాం అంటే పట్టాలపై రైలు రావడం కాదండోయ్.. ప్లాట్ ఫాం పైన్ రైలు రావడం. ఊహించుకుంటేనే ఒళ్లు ఝలదరిస్తుంది కదూ. మనకే ఇలా అనిపిస్తుంటే..అదే సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచిస్తుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. చెన్నై(Chennai) లోని బీచ్ రైల్వే స్టేషన్(Railway Station) లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. సబర్బన్‌ రైలు అదుపుతప్పి ప్లాట్‌ ఫాం పైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై వర్క్‌షాప్‌ నుంచి కోస్టల్‌ రైల్వే స్టేషన్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

పట్టాలపై వేగంగా వస్తున్న సబర్బన్ రైలు.. కంట్రోల్ తప్పి భారీ శబ్దంతో ప్లాట్‌ఫాం వైపు దూసుకొచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ ఫాంపై ఉన్న ప్రయాణికులందరూ పరుగులు పెట్టారు. రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు సైతం రైలు నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్‌ మాత్రం గాయపడగా వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read: