ప్రియాంక గాంధీ నుండి ఆ పెయింటింగ్‌ను రూ.2కోట్లకు బలవంతంగా కొనిపించారు.. ED ఛార్జిషీట్‌లో రాణా కపూర్

కాంగ్రెస్‌కు చెందిన ప్రియాంక గాంధీ వాద్రా నుండి ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాల్సిందిగా బలవంతం చేశారని, ఆ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని గాంధీ కుటుంబం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వైద్యం కోసం వినియోగించిందని యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు తెలిపారు.

ప్రియాంక గాంధీ నుండి ఆ పెయింటింగ్‌ను రూ.2కోట్లకు బలవంతంగా కొనిపించారు.. ED ఛార్జిషీట్‌లో రాణా కపూర్
Priyanka Rama Kapoor
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 24, 2022 | 12:29 PM

Yes Bank co-founder Rana Kapoor: కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా నుండి ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాల్సిందిగా బలవంతం చేశారని, ఆ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని గాంధీ కుటుంబం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వైద్యం కోసం వినియోగించిందని యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు తెలిపారు. న్యూయార్క్‌లోని ప్రత్యేక కోర్టులో ఫెడరల్ యాంటీ మనీలాండరింగ్ ఏజెన్సీ దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం.. పెయింటింగ్‌ను కొనుగోలు చేయడానికి నిరాకరించడం వల్ల గాంధీ కుటుంబంతో తనకు సంబంధాలు ఏర్పడకుండా ఉండటమే కాకుండా ‘పద్మభూషణ్’ అవార్డును కూడా పొందకుండా అడ్డుకుంటుందని అప్పటి పెట్రోలియం మంత్రి మురళీ దేవరా తనకు చెప్పారని కపూర్ EDకి తెలిపారు.

ఇదిలావుంటే, మనీలాండరింగ్‌లో యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు, అతని కుటుంబం, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధావన్‌లపై ప్రత్యేక కోర్టులో రాణా కపూర్ చేసిన రెండవ అనుబంధ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో మూడు ఛార్జిషీట్లను నమోదు చేశారు. ఈ పెయింట్‌కు సంబంధించి రూ.2 కోట్ల చెక్కు ఇచ్చానని రాణా కపూర్ పేర్కొన్నారు. దీని తరువాత, మిలింద్ దేవరా తనతో మాట్లాడుతూ, అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని గాంధీ కుటుంబం న్యూయార్క్‌లో సోనియా గాంధీ చికిత్స కోసం ఉపయోగించిందని చెప్పారు.

సోనియా గాంధీ చికిత్స కోసం సరైన సమయంలో గాంధీ కుటుంబానికి సహాయం చేయడం ద్వారా తాను మంచి పని చేశానని సోనియా గాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్ తనతో చెప్పారని కపూర్ ఈడీకి తెలిపారు. అందుకే ఆయన పేరును ‘పద్మభూషణ్’ అవార్డుకు పరిశీలిస్తున్నట్లు చెప్పరన్నారు. దీనితో పాటు, రాణా కపూర్ ED కి ఇచ్చిన ఒక ప్రకటనలో 2010 సంవత్సరంలో, మురళీ దేవరా రాణా కపూర్‌తో పెయింటింగ్‌ను కొనుగోలు చేయకపోతే, అది తనపై యెస్ బ్యాంక్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పాడన్నారు.

ఛార్జిషీట్ ప్రకారం, రాణా కపూర్ పెయింటింగ్ కొనుగోలు గురించి మాట్లాడుతూ, దీనికి నేను ఎప్పుడూ సిద్ధంగా లేని కొనుగోలు అని మొదట చెప్పాలనుకుంటున్నాను. కానీ మిలింద్ డియోరా అతనిని ఒప్పించడానికి అతని ఇల్లు, కార్యాలయం చుట్టూ అనేక సార్లు చక్కర్లు కొట్టారు. అంతేకాదు ఈ విషయమై చాలా మొబైల్ నంబర్ల నుంచి నాకు కాల్స్, మెసేజ్‌లు కూడా చేశారు. అయినప్పటికీ ఈ ఒప్పందానికి నేను అంగీకరించలేదు. నేను అతని కాల్స్, మెసేజ్‌లను చాలాసార్లు తప్పించుకున్నానని రాణా ఈడీకి వివరించినట్లు సమాచారం.

ఇదిలావుంటే, అనుమానాస్పద లావాదేవీల ద్వారా రాణా కపూర్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధావన్ రూ.5,050 కోట్ల నిధులను మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. మార్చి 2020లో అరెస్టు చేసినప్పటి నుండి అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Read Also….  Viral Video: ఇది కదా కరేజ్.. రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేసినా.. ఇంచ్ కూడా వెనక్కి తగ్గని కింగ్ కోబ్రా..