AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric Scooters: పేలిపోతున్న ఎలక్ట్రిక్ బైక్ లు.. ఓలా కంపెనీ కీలక నిర్ణయం..

Ola Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాలు గత కొంత కాలంగా కారణం తెలియకుండానే పేలిపోతున్నాయి(Fire). కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంది. ఈ తరుణంలో ఓలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది..

Ola Electric Scooters: పేలిపోతున్న ఎలక్ట్రిక్ బైక్ లు.. ఓలా కంపెనీ కీలక నిర్ణయం..
Ola Scooters
Ayyappa Mamidi
|

Updated on: Apr 24, 2022 | 12:15 PM

Share

Ola Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాలు గత కొంత కాలంగా కారణం తెలియకుండానే పేలిపోతున్నాయి(Fire). కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంది. వరుసగా జరుగుతున్న ఈవీలు కాలిపోవటం వెనుక కారణాలు కనుక్కోమని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో పలు కంపెనీలు తమ వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. తాజాగా.. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకున్న ఘటనల నేపథ్యంలో 1,441 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్(Recall) చేస్తున్నట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. మార్చి 26న పూణెలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని కంపెనీ తెలిపింది.

అయితే ముందస్తు చర్యగా.. నిర్దిష్ట బ్యాచ్‌లోని స్కూటర్‌ల డయాగ్నసిస్, వెహికల్ కండిషన్ తనిఖీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగానే 1,441 వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ స్కూటర్‌లను తమ కంపెనీ సర్వీస్ ఇంజనీర్లు తనిఖీ చేస్తారని మరియు ఓలా ఎలక్ట్రిక్ చెప్పింది. ఈ సమయంలో వాహనంలోని బ్యాటరీ సిస్టమ్‌లు, థర్మల్ సిస్టమ్‌లు, భద్రతా వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని కంపెనీ పేర్కొంది. యూరోపియన్ స్టాండర్డ్ ECE 136కి అనుగుణంగా ఉండటంతో పాటు.. దేశంలో ప్రతిపాదిత ప్రమాణమైన AIS 156ను తమ బ్యాటరీ సిస్టమ్స్ ఇప్పటికే పాటిస్తున్నాయని స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైన సంఘటనలు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. ఈ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదాలను అరికట్టేందుకు తయారీదారులు తమ వాహనాలను రీకాల్ చేయవలసి వస్తోంది. ఒకినావా ఆటోటెక్ 3,000 యూనిట్లకు పైగా రీకాల్ చేసింది. Pure EV దాదాపు 2,000 యూనిట్ల కోసం ఇదే విధమైన కసరత్తు చేసింది. నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే కంపెనీలపై భారీగా జరిమానాలు ఉంటాయని కేంద్రం ఈ మధ్య హెచ్చరించింది. నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించింది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Zomato: ఫుడ్ ప్యాకింగ్ విషయంలో జొమాటో సంచన నిర్ణయం.. ఈ నెల నుంచి వాటిపై పూర్తి నిషేధం..

House Buying: ఇంటి కోసం మీరు డబ్బు కట్టిన కంపెనీ దివాలా తీస్తే ఏమి చేయాలి.. పూర్తి వివరాలు..