Zomato: ఫుడ్ ప్యాకింగ్ విషయంలో జొమాటో సంచలన నిర్ణయం.. ఈ నెల నుంచి వాటిపై పూర్తి నిషేధం..

Zomato: ప్లాస్టిక్‌ భూతం.. సమస్త మానవాళిని కబలిచ్చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం కొండలా పేరుకుపోతోంది. ఈ తరుణంలో జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది.

Zomato: ఫుడ్ ప్యాకింగ్ విషయంలో జొమాటో సంచలన నిర్ణయం.. ఈ నెల నుంచి వాటిపై పూర్తి నిషేధం..
Zomato
Follow us

|

Updated on: Apr 24, 2022 | 1:30 PM

Zomato: ప్లాస్టిక్‌ భూతం.. సమస్త మానవాళిని కబలిచ్చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం కొండలా పేరుకుపోతోంది. ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది. రోజు వారీ చేసే షాపింగ్ నుంచి వాడుతున్న వాటర్ బాటిళ్ల వరకూ అన్నీ ప్లాస్టిక్ తో తయారు చేసినవే. ప్లాస్టిక్ వల్ల ఉండే దుష్ప్రభావాలు తెలిసినప్పటికీ.. ప్రజలు దానిని వాడంటం మాత్రం మానుకోవటం లేదు. ఇలాంటి తరుణంలో ఫుడ్‌ డెలివరీ దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు దేశీయ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం జొమాటో శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఇకపై తమ కస్టమర్లకు 100 శాతం ప్లాస్టిక్‌ న్యూట్రల్‌ డెలివరీలను అందించనున్నట్లు ప్రకటించింది. అంటే.. డెలివరీల్లో భాగంగా వినియోగించిన ప్లాస్టిక్‌కు సమానమైన దానిని 100 శాతం రీసైకిల్‌ చేయనునట్లు వెల్లడించింది. దీనిని విజయవంతంగా ముందుకు వెళ్లేందుకు ISO గుర్తింపు ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ కంపెనీలతో డెలవరీ దిగ్గజం చేతులు కలుపుతోంది. ఈ సంస్థలు ప్లాస్టిక్‌ను సేకరించి ప్రాసెస్‌ చేస్తాయి. స్థిర ప్యాకేజింగ్‌ విధానంలో మూడేళ్లలో 10 కోట్ల ఆర్డర్లను పూర్తి చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. ఈ నెల నుంచే ఈ ఎకోఫెండ్లీ ప్యాకింగ్ విధానాన్ని కంపెనీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్లాస్టిక్‌ లభిస్తున్న ధరలో అందుబాటులోకి వచ్చేలా బయోడీగ్రేడబుల్, ప్లాస్టికేతర ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ముఖ్యమని కంపెనీ అంటోంది. ఫుడ్‌ డెలివరీలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, తొలగించడం కోసం మరింత కృషి జరగాల్సి ఉందని సీఈవో దీపిందర్‌ గోయల్‌ అభిప్రాయపడుతున్నారు. అన్ని రకాల వంటకాలకు స్థిరమైన ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి ప్రయత్నాలను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ చర్యల కారణంగా భారీ ఎత్తున డబ్బు ఖర్చవుతుంది. ఆదాయం, లాభంపైనా ప్రతికూలంగా ప్రభావితం ఉండనుంది. భూమికి ఏది మంచిదో అది వ్యాపారానికీ మంచిదని గట్టిగా నమ్ముతున్నట్లు సీఈవో అన్నారు. కంపెనీ నిర్వహణలో మిగిలిన పనులు సరిగా చేసినప్పుడు లాభాలు వస్తాయని ఆయన అంటున్నారు. ఇది ఖచ్చితంగా సరైన దిశలో ఒక అడుగని ఆయన అంటున్నారు.

ఇవీ చదవండి..

House Buying: ఇంటి కోసం మీరు డబ్బు కట్టిన కంపెనీ దివాలా తీస్తే ఏమి చేయాలి.. పూర్తి వివరాలు..

Crude Prices: చమురు ధరలకు స్టాక్ మార్కెట్‌కు మధ్య సంబంధం ఏమిటి?