Cows Online: ట్రెండ్ మారింది.. ఆన్‌లైన్‌లో ఆవులు, గేదెల అమ్మకాలు షురూ..
Cows Online: ఈ రోజుల్లో ప్రతిదీ డిజిటల్‌గా మారుతోంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో(Milk Production) 22 శాతం భారత్ నుంచి ఉంది. ఈ తరుణంలో పశువుల క్రయవిక్రయాలకు స్టార్టప్ కంపెనీలు తమ సేవలను అందిస్తున్నాయి.
Cows Online: ఈ రోజుల్లో ప్రతిదీ డిజిటల్‌గా మారుతోంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో(Milk Production) 22 శాతం భారత్ నుంచి ఉంది. దీనితో భారత్ మెుదటి స్థానంలో ఉంది. ఈ తరుణంలో.. దేశంలో సాంప్రదాయ పశువుల సంతల స్థానంలో ఆన్‌లైన్‌లో పశువులను కొనుగోలు చేయడం, విక్రయించడం అందుబాటులోకి రావటం ఆశ్చర్యకరంగా నిలుస్తోంది. ఈ రసవత్తరమైన మార్కెట్‌లో Pashushala, Animall వంటి స్టార్టప్ కంపెనీలు సేవలను ప్రారంభించాయి. వీరు పశువులను విక్రయించటంతో పాటు ఆన్‌లైన్ వెట్(Vet) సందర్శనల వంటి అదనపు సేవలను కూడా అందిస్తున్నాయి. అసలు ఈ తరహా కొత్తతరం వ్యాపారాలు అందిస్తున్న సేవలు పశువుల క్రయవిక్రయాలను ఎంత సులువుగా మార్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా సహాయపడతాయి?
చాలా పశువులు ఇప్పటికీ పశువుల సంతలలో కొనుగోలు, విక్రయాలు జరుగుతుంటాయి. అవి సరైన ప్రామాణిక పద్దతులు లేనందున ఖరీదైనవి, అస్తవ్యస్తమైనవిగా ఉన్నాయి. రైతులకు రవాణా ఖర్చు నుంచి పశువుల దొంగల వరకు అనేక పరిణామాలు ఆందోళన కలిగిస్తుంటాయి. ఆవులు గేదెల అమ్మకంలో సరైన కొనుగోలు దారులను కనుగొనలేక పోతే సదరు రైతు ఈ ప్రక్రియను మళ్లీ మెుదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. కేవలం ఇదొక్కటే కాకుండా.. ఈ క్రయ విక్రయాల్లో మోసాలు ఎక్కువగా ఉంటాయని రైతులు ఆందోళన చెందుతుంటారు. వీటికి అదనంగా పశువులను అమ్మే వారు వాటికి స్టెరాయిడ్స్, ఇంజెక్షన్లను ఇవ్వటం, కొమ్ములను పాలిష్ చేయటం వంటివి చేస్తుంటారు. ఆవులను అమ్మటానికి తీసుకెళ్లే ముందు అందంగా ముస్తాబు చేస్తుంటారని రైతులు చెబుతున్నారు.
ఇలాంటి తరుణంలో Pashushala, Animall స్టార్టప్ కంపెనీలు ఈ వ్యాపారంలోకి అరంగేట్రం చేశాయి. పశువుల క్రయవిక్రయాల్లో ఎదురవుతున్న పైన చెప్పిన లాంటి అనేక సమస్యలను తాము పరిష్కరిస్తున్నట్లు ఆ కంపెనీలు చెబుతున్నాయి. ఇందుకోసం అనేక తనఖీ పద్ధతులను పాటిస్తున్నట్లు వారు వెల్లడిస్తున్నాయి. పశువులకు స్థానిక వెటర్నరీల నుంచి వాటి ఆరోగ్య పరిస్థితితో పాటు ఇతర అంశాలపై ఆమోదం తీసుకుంటున్నట్లు స్టార్టప్ కంపెనీలు వెల్లడించాయి.
Animall స్టార్టప్ లో పశువులను అమ్మాలనుకునే వారు వాటి ఫొటోలను, వీడియోలను అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటు సదరు ఆవు లేదా గేదె వయస్సు, బ్రీడ్, గతంలో గర్భం దాల్చిన వివరాలు, ఎన్ని పాలు ఇస్తుంది లాంటి వివరాలు వెల్లడించాలి. ఆ తరువాత సంస్థకు సంబంధించిన ప్రతినిధులు సదరు వ్యక్తికి కాల్ చేసి వివరాలను వెరిఫై చేస్తారు. సరిగా లేని వీడియోలు, ఫొటోలను తమ వెబ్ సైట్ నుంచి వారు తొలగిస్తారు. ఇలా పశువులను కొని అమ్మేందుకు ప్రత్యేకమైన ఆన్ లైన్ సేవలను అవి అందిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Ola Electric Scooters: పేలిపోతున్న ఎలక్ట్రిక్ బైక్ లు.. ఓలా కంపెనీ కీలక నిర్ణయం..
Zomato: ఫుడ్ ప్యాకింగ్ విషయంలో జొమాటో సంచన నిర్ణయం.. ఈ నెల నుంచి వాటిపై పూర్తి నిషేధం..