Acharya : ఆచార్య సినిమా నుంచి కాజల్ పాత్రను అందుకే తొలగించాం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ డైరక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా ఆచార్య (Acharya). ఇందులో రామ్ చరణ్,

Acharya : ఆచార్య సినిమా నుంచి కాజల్ పాత్రను అందుకే తొలగించాం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Kajal
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 25, 2022 | 10:57 AM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ డైరక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా ఆచార్య (Acharya). ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఏప్రిల్ 29న ఘనంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అయితే మొదటి నుంచి ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోందని మేకర్స్ ప్రకటించారు. గతంలో విడుదలైన లాహే లాహే పాటలోనూ కాజల్ సిందులేస్తూ కనిపించింది. అయితే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‏లో కాజల్ ఎక్కడా కనిపించలేదు. అలాగే ఏప్రిల్ 23న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో కాజల్ పాత్ర గురించి ఎవరూ స్పందించలేరు. దీంతో కాజల్ పాత్ర తొలగించారంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. ఇటీవల ఓ ఛానల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పాత్ర పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. “ముందుగా సినిమా అనుకున్నప్పుడు హీరోకు జీడిగా హీరోయిన్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం.. దర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్ పాత్ర క్రియేట్ చేశాం.. నాలుగు రోజులు షూట్ చేశాం కూడా.. కానీ ఆచార్య పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా ? అనే విషయంపై సందేహాలు వచ్చాయి. కరోనా కారణంగా షూటింగ్ గ్యాప్ వచ్చింది. నక్సలిజం సిద్ధాంతం ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదని.. హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి పాత్రను సృష్టించాం.. అంత పెద్ద హీరోయిన్‏తో చేయిస్తే బాగోదు అనుకున్నాం.. ఆ తర్వాత చిరంజీవిగారితో మాట్లాడితే నీ ఇష్టం అన్నారు.. దీంతో కాజల్ పాత్ర తొలగించాం.. ఇదే విషయాన్ని కాజల్ కు కూడా చెప్పాం.. తను కూడా ఒప్పుకుంది.. భవిష్యత్తులో సినిమా చేద్దాం అంది ” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ ?..

Ram Charan: బాబాయ్‏తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..

Viral Video: బాబోయ్.. ఎక్కడా చోటు లేనట్టు అమ్మాయి జుట్టులో చిక్కుకున్న పాము.. ఒళ్లుగగుర్బొడిచే వీడియో…