Akshaya Tritiya 2022: ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. అక్షయ తృతీయ రోజున ఏఏ రాశివారు ఏఏ దానాలు చేయాలంటే..

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ సనాతన ధర్మంలో (Sanatana Hindu Dharma)ఒక ముఖ్యమైన పర్వదినంగా భావించి వైభవంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసం..

Akshaya Tritiya 2022: ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. అక్షయ తృతీయ రోజున ఏఏ రాశివారు ఏఏ దానాలు చేయాలంటే..
Akshaya Tritiya 2022
Follow us

|

Updated on: Apr 25, 2022 | 8:14 PM

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ సనాతన ధర్మంలో (Sanatana Hindu Dharma)ఒక ముఖ్యమైన పర్వదినంగా భావించి వైభవంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసం(Vaisakha Masam) శుక్ల పక్షం మూడవ రోజున వస్తుంది. ఈ ఏడాది 2022   మే 03 న అక్షయ తృతీయగా జరుపుకోనున్నారు. ఈ రోజు శుభ కార్యాలకు ప్రత్యేకం. అంతేకాదు ఈరోజు చేసే దానాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు బంగారం కొనడం వల్ల కూడా మేలు జరుగుతుందని నమ్మకం. ముహూర్తం లేకుండా అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు మొదలు పెడతారు. ఈ రోజున  రాశి ప్రకారం ఆయా రాశులకు చెందిన వ్యక్తులు దానధర్మాలు చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. కనుక ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున   మీ రాశి ప్రకారం మీరు ఏమి చేయాలో తెలుసుకుందాం…

మేష రాశి: మేష రాశి వారు అక్షయ తృతీయ రోజున ఎరుపు రంగు వస్త్రం, లడ్డూలను దానం చేయాలి. ఈ రాశివారు ఈ దానాలు చేయడం వలన కష్టాలు తీరాయి.

వృషభ రాశి: ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున నీరుతో నిండిన కలశాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుక్ర దోష ప్రభావం తగ్గుతుంది. ఆర్ధిక బాధలు కూడా తొలగిపోతాయని నమ్మకం.

మిధునరాశి: ఈ రాశివారు తృతీయ నాడు చంద్రుడు దయ కోసం పప్పును దానం చేయాలి. ఇది కుటుంబ సభ్యుల  జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

కర్కాటక రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు. కనుక ఈ ప్రత్యేకమైన రోజున వెండితో ఉన్న ముత్యాలను ధరించాలి. ఇలా చేయడం వలన ఈరాశివారికి చంద్రబలం పెరుగుతుంది. విజయాన్ని సొంతం చేస్తుంది.

సింహ రాశి : ఈ రాశి వారు ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానునికి నీరు సమర్పించాలి. అంతే కాకుండా  బెల్లం దానం చేయాలి. ఇది జీవితంలో పురోగతిని ఇస్తుంది.

కన్య రాశి: ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున పచ్చని ధరించాలి. ఇది సంపదను ఇస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి కృప కలుగతుంది. జీవితంలో ఆర్ధిక కష్టాలు తీరతాయి. అయితే పచ్చని ధరించే ముందు జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది.

తుల రాశి: అక్షయ తృతీయ రోజున ఈ రాశి వారు ముఖ్యంగా తెల్లని వస్త్రాలను దానం చేయాలి. అంతేకాదు ఇష్ట దేవత తెలుపు రంగు విగ్రహాన్నిపూజలో పెట్టుకోవచ్చు.

వృశ్చిక రాశి: అక్షయ తృతీయ రోజున వృశ్చిక రాశి వారు పగడాన్ని ధరించడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున పసుపు గుడ్డలో పసుపు వేసి.. ముఠకింద చుట్టి పూజా స్థలంలో ఉంచాలి. అంతే కాకుండా పసుపు రంగు వస్తువులను  దానం చేయడం వలన విశేష ఫలితాలు పొందుతారు.

మకర రాశి: డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి, మకరరాశి వారు ఈ రోజున ఇంటి తూర్పు వైపున ఒక పాత్రలో నువ్వుల నూనెను ఉంచాలి.ఇలా  చేయడం వలన అనేక ప్రయోజనాలను ఇస్తుంది.

కుంభ రాశి: కుంభ రాశి వారు నల్ల నువ్వులు, కొబ్బరి, ఇనుము దానం చేయాలి. దీనితో పాటు, ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంది. కనుక ఈరోజు ఎటువంటి పరిస్థితులైనా ఈ రాశివారికి అనుకూలంగా మారతాయి.

మీన రాశి: అక్షయ తృతీయ శుభ సందర్భంగా, మీన రాశి వారు పసుపు రంగు వస్త్రంలో పసుపు పువ్వులను కట్టి, ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మా లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్ధిక బాధలు తొలగిపోతాయి.

(Note: జ్యోతిష్యం రాశిఫలాలు  అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read:ISKCON Temple: రోజు రోజుకీ పెరుగుతున్న వేసవి తాపం.. చల్లదనం కోసం దేవుళ్ళకు ఏసీ, ఫ్యాన్ల సౌకర్యం.. ఎక్కడంటే..