AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISKCON Temple: రోజు రోజుకీ పెరుగుతున్న వేసవి తాపం.. చల్లదనం కోసం దేవుళ్ళకు ఏసీ, ఫ్యాన్ల సౌకర్యం.. ఎక్కడంటే..

ISKCON Temple: భారతదేశం(India) వ్యాప్తంగా రోజు రోజుకీ ఎండలు(Summer Heat) మండుతున్నాయి. భానుడు భగభగలతో పాటు, వేడిగాలులు(Heat Waves) వీస్తుండడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు..

ISKCON Temple: రోజు రోజుకీ పెరుగుతున్న వేసవి తాపం.. చల్లదనం కోసం దేవుళ్ళకు ఏసీ, ఫ్యాన్ల సౌకర్యం.. ఎక్కడంటే..
Temple In Bihar
Surya Kala
|

Updated on: Apr 25, 2022 | 8:14 PM

Share

ISKCON Temple: భారతదేశం(India) వ్యాప్తంగా రోజు రోజుకీ ఎండలు(Summer Heat) మండుతున్నాయి. భానుడు భగభగలతో పాటు, వేడిగాలులు(Heat Waves) వీస్తుండడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనుషులకేనా వేసవి ఉక్కబోతతో ఇబ్బంది.. గుడిలో దేవుళ్ళకు కూడా ఇబ్బందే అంటున్నారు కొంతమంది.. అందుకనే దేవుళ్ళకు చల్లదనం ఇవ్వడం కోసం.. ఒక ఆలయంలో మూలవిరాట్టుల కోసం ఫ్యాన్లు, ఏసీలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన బీహార్‌లోని గయా ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బీహార్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం గయ. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా ఫేమస్. అయితే వేసవిలో గయలో తీవ్ర ఎండలు ఉంటాయి. ఏప్రిల్ నెలలోనే జూన్ నెలలో ఉన్నట్లు ఉష్ణోగ్రత తీవ్రత ఉంటుంది.  ఈప్రాంతంలో నివసించే ప్రజలు ఎండ వేడి కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల సాయంతో సామాన్యులు ఎండ వేడిమి నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు.  అయితే మరి ఈ మండుటెండలో దేవుళ్ళకు పరిస్థితి ఏమిటి..అని ఇస్కాన్ టెంపుల్ సిబ్బంది ఆలోచించారు. వెంటనే ఆలయంలో దేవతామూర్తులకు చల్లదనం కోసం ఏసీలు ఫ్యాన్స్లు ఏర్పాటు చేశారు. ఇస్కాన్ ఆలయంలో ఉన్న దేవతా విగ్రహాలైన రాధ, కృష్ణుడు, జగన్నాథుడుకు ఏసీ లు ఏర్పాటు చేశారు.

ఇదే విషయంపై దాస్ మాట్లాడుతూ.. తమ కంటే.. దేవుళ్ళే ముఖ్యమని.. తమకు ఏసీలు వంటి సౌకర్యాలు అవసరం లేదని.. అందుకనే దేవుళ్ళకు ఈ సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఇది భక్తులు ఇచ్చారని తెలిపారు. అంతేకాదు దేవుడు తనకు ప్రసాదంగా ఆహారపదార్ధాలు పెట్టమని అడగడు.. కానీ మనమే నైవేద్యం ఇష్టంగా సమర్పిస్తాం.. అదే విధంగా దేవుడు తనకు ఏసీలు, ఫ్యాన్లు అడగడు.. భక్తులే దేవుడికి కోసం ఏర్పాటు చేశారు. ఇది భావోద్వేగానికి సంబంధించిన విషయని అన్నారు.

మరోవైపు బీహార్ లో గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read:

గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం !! బూట్లు కొట్టేసిన దొంగ !! ఆ తరవాత ఏంజరిగిందంటే ??

Sara Tendulkar: డాక్టర్ చదివి యాక్టర్ గా మారుతున్న ప్రముఖ క్రీడాకారుడు తనయ.. త్వరలో వెండి తెరపై ఎంట్రీ అంటూ టాక్..