Horoscope Today: వీరు అనవసర ఖర్చులతో ఇబ్బందులు పడతారు.. మానసిక ప్రశాంతత కోల్పోతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today: శుభకార్యాలు, మంచి కార్యక్రమాలు చేపట్టాలంటే ముహూర్తాలు చూసుకుంటారు. అదేవిధంగా చాలా మంది ఉదయం లేవగానే ఆరోజు తమ రాశి ఫలాలు (Rasi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు.
Horoscope Today: శుభకార్యాలు, మంచి కార్యక్రమాలు చేపట్టాలంటే ముహూర్తాలు చూసుకుంటారు. అదేవిధంగా చాలా మంది ఉదయం లేవగానే ఆరోజు తమ రాశి ఫలాలు (Rasi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వాటిని అనుసరించే ముందుకు సాగుతుంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. మరి ఏప్రిల్ 25 (సోమవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి
మేషం
చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబీకులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. గణపతి దేవుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.
వృషభం
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబీకులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన ప్రయాణాలు ఫలిస్తాయి. విష్ణు దేవుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.
మిథునం
వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యం కోల్పోకూడదు. ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఇష్టదేవతలను ఆరాధించడం వల్ల మేలు కలుగుతుంది.
కర్కాటకం
పట్టుదలతో ఆటంకాలను అధిగమిస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర గొడవలు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. సూర్య భగవానుడిని పూజిస్తే శుభం కలుగుతంది.
సింహం
శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు అందుకోవాలంటే మరింత కష్టపడాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబీకులు, పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవాలి. దుర్గామాతను సందర్శించుకుంటే సానుకూల ఫలితాలు అందుకుంటారు.
కన్య
ఈరాశివారికి శుభఘడియలు నడుస్తున్నాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. శ్రీనివాసుడిని పూజించడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు.
తుల
వీరు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యం కోల్పోకుండా ముందకు సాగాలి. భవిష్యత్ ప్రణాళికలు తీసుకునేటప్పుడు కుటుంబీకులు, పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవాలి. నవగ్రహ శ్లోకాలను పఠించడం వల్ల మేలు కలుగుతుంది.
వృశ్చికం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమాధిక్యం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామాలు ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
ధనస్సు
చేపట్టిన రంగాల్లో పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు అందుకుంటారు. దుర్గాదేవిని పూజించడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారు.
మకరం
ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యంగా మెలుగుతారు. కీలక విషయాల్లో అశ్రద్ధ వద్దు. ఇష్టదేవతలను ఆరాధిస్తే మంచిది.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. మానసికంగా మరింత దృఢంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శించుకోవడం వల్ల మేలు కలుగుతుంది.
మీనం
కీలక వ్యవహారాల్లో సన్నిహితుల, మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. సానుకూల ఫలితాలు అందుకుంటారు. సూర్య భగవానుడిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: LSG vs MI: ముంబై ఇండియన్స్‌కి వరుసగా ఏడో ఓటమి.. సూపర్ విక్టరీ సాధించిన లక్నో సూపర్ జెయింట్స్
Hyderabad Pub: గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో దారుణం.. కస్టమర్‌ను చితకబాదిన ముగ్గురు బౌన్సర్లు
Digital TOP 9 NEWS: హద్దులు దాటి బైక్‌పై లవర్స్ ముద్దులు.. కుల్దీప్‌ను మెడపట్టి తోసిన చాహల్!