Hyderabad Pub: గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో దారుణం.. కస్టమర్‌ను చితకబాదిన ముగ్గురు బౌన్సర్లు
పబ్ లో కస్టమర్ పై బౌన్సర్లు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజంపబ్ లో జరిగిన ఘటన కస్టమర్లను భయబ్రాంతులకు గురిచేస్తుంది.
పబ్ లో కస్టమర్ పై బౌన్సర్లు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజంపబ్ లో జరిగిన ఘటన కస్టమర్లను భయబ్రాంతులకు గురిచేస్తుంది. గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో దారుణం చోటుచేసుకుంది. కస్టమర్ పై బౌన్సర్లు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందకిషోర్ అనే కస్టమర్‌ను ముగ్గురు బౌన్సర్లు చితకబాదారు. బౌన్సర్లతో పాటు పబ్ యజమాన్యం కూడా దాడికి దిగింది. బౌన్సర్ల పిడిగుద్దులకు నందకిషోర్ ముక్కు, నోటి నుంచి బ్లీడింగ్ అయింది. దాడి దృశ్యాలు పబ్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిన్ను ముఖం పగులగొట్టను, చంపేస్తా అని అప్పటికే గాయపడి ఉన్న నందకిషోర్‌ను ఓ వ్యక్తి బెదిరించాడు.
బౌన్సర్ల దాడిపై పోలీసులకు బాధితుడు నంద కిషోర్ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రిజం పబ్‌లో ఈఘటన శనివారం రాత్రి జరిగింది. నో స్మోకింగ్ జోన్‌లో స్మోక్ చేశానని, తనకు అసలు అది నో స్మోకింగ్ జోన్ అని తెలిదయని చెప్పాడు నందకిషోర్.
మొట్ట మొదటిసారిగా తాను పబ్‌కి వెళ్లానని తెలిపాడు. బౌన్సర్స్ తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని చెప్పాడు. బౌన్సర్లు దాడి చేసే సమయంలో తన ఫ్రెండ్స్ వచ్చి ఆపినా.. కాళ్లు పట్టుకున్నా వదలలేదని ఆవేదన వ్యక్తం చేశాడు నందికిషోర్. దాడిలో తీవ్రంగా గాయపడిన నందకిషోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇవి కూడా చదవండి: Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..
Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..