Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..

కాలంతో సంబంధం లేకుండా వానొచ్చినా.. ఎండలు దంచికొట్టినా సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అయితే పక్షులు మరింత జాగ్రత్తలు తీసుకుంటాయి. పక్షులు గుడ్లు పెట్టేమేందే తమ ఇంటిని ప్లాన్ చేస్తాయి.

Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..
Clever Crow Secretly Collec
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 24, 2022 | 6:02 PM

వానా కాలం వస్తే… వర్షం కురిస్తే తడవని ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటారు..అది మనమైనా.. పక్షులైనా.. అదే కాలంతో సంబంధం లేకుండా వానొచ్చినా.. ఎండలు దంచికొట్టినా సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అయితే పక్షులు మరింత జాగ్రత్తలు తీసుకుంటాయి. పక్షులు గుడ్లు పెట్టేమేందే తమ ఇంటిని ప్లాన్ చేస్తాయి. చక్కటి గూళ్లు పెట్టుకుంటాయి. ఇవే వాటికి ఇళ్లు… వర్షం వస్తే వీటిలోకి వెళ్తాయి. పక్షుల గూళ్లు అందంగా ఉంటాయి… చూడ ముచ్చటగా ఉంటాయి.. ఇవి పల్లె ప్రాంతాలు, చెట్లు ఎక్కువ ఉన్న చోట్ల విరివిగా మనకు కనిపిస్తుంటాయి. పొలాల్లో పిచ్చుకలు గూళ్లు పెట్టుకుంటూ కనిపిస్తాయి. ఈ అపు‘రూప’ దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది.

పక్షులు గూళ్లు కట్టినప్పుడు, అవి నేల, చెట్ల నుంచి చిన్న కలపను సేకరిస్తాయి. అంతే కాదు, గూడును బలంగా చేయడానికి చిన్న చెక్కతో పాటు, గడ్డి లేదా తీగను కూడా ఉపయోగిస్తారు. అలా నిర్మాణం ముగిసిన తర్వత లోపల మరింత సేఫ్‌గా, మెత్తగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటాయి. ఇందు కోసం మృదువైన వస్తువులను ఎంచుకుంటాయి.. అందులో దూదిని సేకరిస్తుంటాయి కొన్ని పక్షలు. అయితే ఓ పక్షి మాత్రం మీ ఊహలకు భిన్నంగా ప్లాన్ చేసింది. తాను పెట్టబోయే గుడ్లు.. అందులో నుంచి వచ్చే పిల్లల కోసం అద్భుమైన ఎంపిక చేసుకుంది. దాని ఎంపిక ఇవాళ సోషల్ మీడియాలో వావ్.. అనిపిస్తోంది. దాని ప్లాన్‌కు సెల్యూట్ చేస్తున్నారు నెటిజనం.

ఈ వీడియోలో కాకి చేసిన ప్లాన్ చూడవచ్చు..

 

అడవిలో ఉండే జింక వెంట్రుకలను ఎంచుకుంది. ఎంతో మెత్తగా ఉండే జింక బొచ్చును కాకి ఎంచుకోవడం.. అందులోనూ తెల్లటి బొచ్చును ఎంచుకోవడం వింతగా అనిపిస్తుంది. తన రంగు నలుపు.. అది ఎంచుకున్నది మాత్రం తెలుపు. జింక తోకలో ఉన్న బొచ్చును ముక్కుతో సేకరిస్తోంది.

అయితే సహజంగా కాకులు తమ గూళ్ళను నిర్మించుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం తీసుకుంటాయి. అలా నిర్మించుకున్న తర్వాత అందులో గుడ్లను పెట్టి, పొదుగుతాయి. ఇలా అందులో నుంచి వచ్చిన పిల్ల కాకులను ఎగరగలిగిన తర్వాత వదిలివేస్తాయి.

కాకి తన గూడు కోసం జింక తోకలోని బొచ్చును సేకరించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ‘నేచర్’ పేజీ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా తగిలించింది. ‘గూళ్లు చేయడానికి నాకు ఈ బొచ్చు కావాలి. ధన్యవాదాలు అండి.’ అంటూ పోస్టులో పేర్కొంది. కాకి తెలివికి నెటిజనులు తెగ ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..

Kurnool: కర్నూలు జిల్లాలో కిలాడి దంపతులు.. చోర విద్యలో ప్రావీణ్యులు.. ఏమార్చి..