Kurnool: కర్నూలు జిల్లాలో కిలాడి దంపతులు.. చోర విద్యలో ప్రావీణ్యులు.. ఏమార్చి..
కర్నూలులో కలకలంరేపిన చందన బ్రదర్స్ బంగారు ఆభరణాల కేసును పోలీసులు చేధించారు మహారాష్ట్రలోని థానే జిల్లా బెల్వాలికి చెందిన వినోద్ శామ్రావ్ సాలోంకే, అతడి భార్య షామల దీపక్ జాదవ్‌లను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
AP News: కర్నూలు జిల్లాలో మహారాష్ట్రకు చెందిన కిలాడి దంపతుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. థానే జిల్లా బెల్వాలికి చెందిన శ్యామ్‌రావు-శ్యామల దంపతులు ఈనెల 16న చందన బ్రదర్స్ జువెల్లరీ షాప్‌కి వెళ్లారు. కస్టమర్లలా కటింగ్ ఇస్తూ చాలా న్యాక్‌గా 35 గ్రాముల గోల్డ్ చైన్లు ఎత్తుకెళ్లారు. చోరీ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాప్‌లోకి కూల్‌గా ఎంట్రీ ఇచ్చిన కిలాడి జంట సిబ్బందిని ఏమార్చింది. ఆ నగ ఈ నగ అంటూ హడావుడి చేసింది. అంతలోనే భర్త చేతిలో ఉన్న చైన్ తీసుకుని భార్య దాచేసింది. చాకచాక్యంగా నగ కొట్టేసి అక్కడినుంచి కూల్‌గా వెళ్లిపోయారు. షాప్ యాజమాన్యం ఫిర్యాదుతో.. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్ని గుర్తించారు. కిలాడి జంట మోడస్ ఓపెరాండి తెలుసుకుని షాకయ్యారు. వీళ్లిద్దరూ ఖరీదైన కార్లలో వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతారు. అదే సమయంలో రెక్కీ నిర్వహిస్తారు. ఓ ఫైన్ డే షాప్‌లోకి వెళ్లి నగలు కొట్టేస్తారు. వీళ్లిద్దర్ని అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వీరి క్రైమ్ రికార్డును పోలీసులు పరిశీలిస్తున్నారు. జ్యువెలరీ షాపులో యజమానులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: ఓరి దేవుడా.. ఇదేం తికమక.. ఈ ఫోటోలోని చిరుతని గుర్తిస్తే.. మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లే