AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరి పిల్లలతో కలిసి తాను ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానిరి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తల్లి కూతుళ్ల ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య!
Mother Children Suicide
Raju M P R
| Edited By: |

Updated on: Feb 07, 2026 | 10:22 PM

Share

ఇద్దరి పిల్లలతో సహా తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పిడిన ఘటన తిరుపతి జిల్లా పూత్తూరులో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివకుమార్, నేశనూరుకు చెందిన పద్మకు 8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. పద్మ శివకుమార్ లు పుత్తూరులోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్లకు తేజశ్రీ(7), లాస్య(5) ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం పుత్తూరులోని ఒక ప్రైవేటు స్కూల్‌లో చదువుతుండగా శివకుమార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.

అయితే గత కొన్ని రోజులుగా శివకుమార్ జాబ్‌కు వెళ్లడం మానేశాడు. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. అయితే శనివారం శివకుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో భార్య పద్మ తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బయటకు వెళ్లిన ఇంటికొచ్చిన భర్త శివకుమార్‌కు.. భార్య పద్మ, ఇద్దరు బిడ్డలు ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. అది చూసిన శివ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

వెంటనే పద్మ తల్లిదండ్రులతో పాటు స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వీరి ఆత్మహత్యకు కేవలం ఆర్థిక ఇబ్బందులే కారుణమా లేదంటే మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.