AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముద్రగడ ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్.. కుమార్తెను అడ్డుకున్న అనుచరులు.. అసలేం జరిగిందంటే..

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని చివరిసారిగా చూసేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసు భద్రత మధ్య కిర్లంపూడి నివాసానికి తీసుకెళ్లినా, కుటుంబ సభ్యులు, బంధువుల నిరసనల నడుమ కొద్ది నిమిషాలకే ఆమెను అక్కడి నుంచి పంపించారు.

ముద్రగడ ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్.. కుమార్తెను అడ్డుకున్న అనుచరులు.. అసలేం జరిగిందంటే..
Mudragada Padmanabham
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2026 | 9:42 AM

Share

తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన ముద్రగడ కూతురు క్రాంతిని పోలీసులు ముందే అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల సూచనలతో.. ప్రత్తిపాడు దగ్గర ఆమె కార్లను నిలిపివేశారు. కడచూపుకోసం బ్రతిమాలడంతో ఆమెతో వచ్చిన అన్ని కార్లను ఆపేసి.. పోలీసు భద్రత మధ్య కిర్లంపూడి నివాసానికి తీసుకెళ్లారు. అనంతరం ముద్రగడ ఇంటి దగ్గర పది నిమిషాలపాటు హైడ్రామా నడిచింది. ఉదయం 7.55 నిమిషాలకు ముద్రగడ ఇంట్లోకి క్రాంతి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ సమయంలోనే అభిమానులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఉ.8గంటలకు ముద్రగడ ఇంట్లోకి చేరుకున్నారు క్రాంతి. తండ్రి చివరి చూపు కోసం వచ్చిన కూతురుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీజర్ బాక్స్‌ను కనీసం టచ్‌ కూడా చేయనివ్వలేదు. బంధువులు, అభిమానులతో పాటు.. సొంత తల్లి కూడా కూతురుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఇంటి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. నీ వల్లే.. ముద్రగడ మానసిక క్షోభకు గురయ్యారని, ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ గొడవపడ్డారు. రెండంంటే.. రెండు నిమిషాలు తండ్రి దేహం దగ్గర కూతురును ఉండనివ్వలేదు. కళ్లారా చూసుకోనివ్వలేదు.

పరిస్థితి కంట్రోల్ తప్పుతుండటంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. క్రాంతిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. ఉదయం 8.05కి ముద్రగడ ఇంటి నుంచి క్రాంతి బయటకు వచ్చేశారు. ఐదు నిమిషాల్లోనే కారులో ఎక్కించి కిర్లంపూడి నుంచి పంపించేశారు పోలీసులు.

వీడియో చూడండి..

చనిపోయినా.. కూతురు రావడానికి వీల్లేదు..

పవన్‌ కల్యాణ్‌కి మద్దతుతో తండ్రీకూతురు బంధానికి బీటలు వారాయి. కాపులకు నాయకుడిగా పవన్ ఉన్నారని గతంలో క్రాంతి చెప్పారు. తండ్రితో విభేదించి పవన్‌తో తుని సభలో పాల్గొన్నారు. పవన్‌ని పిఠాపురంలో ఓడించి తీరతానని శపథం చేసిన ముద్రగడ.. లేదంటే పేరు మార్చుకుంటానంటూ ప్రకటించారు. పవన్ గెలుపు తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు ముద్రగడ. అప్పటి నుంచి తండ్రీ కూతుళ్ల మధ్య సయోధ్య లేదు. తాను చనిపోయినా.. కూతురు రావడానికి వీల్లేదని ముందే చెప్పారు ముద్రగడ. పద్మనాభం మాట మేరకు.. ఆమెను కిర్లంపూడి రానివ్వొద్దని పోలీసుల్ని కోరిన బంధువులు. ఈ నేపథ్యంలోనే ప్రత్తిపాడు దగ్గర క్రాంతిని అడ్డుకున్నారు. చివరి చూపు కోసం బ్రతిమాలడంతో.. కేడర్‌ను పక్కన పెట్టి.. కేవలం కుటుంబ సభ్యులే రావాలని, సివిల్ డ్రెస్సులో ఫాలో అవుతూ.. ఆమెను కిర్లంపూడి తీసుకెళ్లారు. కిర్లంపూడిలో అడుగు పెట్టింది మొదలు.. క్రాంతి అక్కడి నుంచి వెళ్లిపోయేవరకు అభిమానులు, బంధువులు ఊరుకోలేదు. చివరకు బలవంతంగా క్రాంతిని అక్కడి నుంచి తీసుకెళ్లారు పోలీసులు.

Follow Us