AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి చివరి ఛాన్స్.. మరో 5 రోజులే అవకాశం..

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) దేశవ్యాప్తంగా 750 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు జులై 20, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు 15, తెలంగాణకు 6 పోస్టులు కేటాయించారు..

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి చివరి ఛాన్స్.. మరో 5 రోజులే అవకాశం..
Indian Overseas Bank Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 15, 2026 | 6:48 AM

Share

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB).. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో ఐదు రోజుల్లోనే ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు జులై 20, 2026వ తేదీ ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 750 అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలలో ఆంధ్రప్రదేశ్‌కు 15, తెలంగాణకు 6 పోస్టులను కేటాయించారు.

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఏడేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ముందుగా NAT లేదా NAP పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు జులై 20, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులు రూ.600, దివ్యాంగ అభ్యర్ధులు రూ.200లు చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,500, అర్బన్ ప్రాంతానికి రూ.14,500, సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.14,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆగస్టు 2న ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20, 2026.
  • దరఖాస్తు రుసుము చెల్లింపుకు చివరి తేదీ: జులై 22, 2026.
  • ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: ఆగస్ట్ 2, 2026.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us