AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ చెల్లింపులు పూర్తిగా బంద్.. జన్మలో చేయలేరు..

ఎల్‌ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ను పూర్తిగా తొలగించింది. ఎల్‌ఐసీ పోర్టల్ ,యాప్ నుంచి ఈ ఆప్షన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. ఇతర వివరాలు..

LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ చెల్లింపులు పూర్తిగా బంద్.. జన్మలో చేయలేరు..
Lic
Venkatrao Lella
|

Updated on: Jul 15, 2026 | 8:30 AM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తన ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ అందించింది. ఎల్‌ఐసీ పాలసీలు తీసుకున్నవారు ప్రతీ నెలా లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. ఆఫ్‌లైన్‌లో ఎల్‌ఐసీ కార్యాలయాల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. లేదా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే అవకాశం అందుబాటులో ఉంది. ఎల్‌ఐసీ పోర్టల్, వెబ్‌సైట్, యూపీఐ యాప్స్ ద్వారా ఆన్‌లైన్లో చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు విధానాల్లో ప్రీమియం చెల్లింపును అవకాశం ఉంది. చాలామంది క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే పేమెంట్లకు రివార్డ్ పాయింట్లతో పాటు ఆఫర్లు ఉంటాయి .

క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేయలేరు

అయితే తన ఖాతాదారులకు ఎల్‌ఐసీ బిగ్ షాకిచ్చింది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలను నిలిపివేసింది. ఇక నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్స్ చేయలేరు. ఈ మేరకు క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే ఆప్షన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 15 రోజుల క్రితమే క్రెడిట్ కార్డు పేమెంట్స్ ఆప్షన్ రిమూవ్ చేసింది. ఇప్పటివరకు ఎల్‌ఐసీ వెబ్ సైట్, యాప్‌లో క్రెడిట్ కార్డు ద్వారా ప్రీమియం చెల్లిస్తే ఎల్‌ఐసీనే గేట్ వే, కన్వీనియన్స్ ఛార్జీలు కస్టమర్ల తరపున భరించేది. అయితే ఎక్కువ మంది క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తుండటంతో ఎల్‌ఐసీకి ఫీజుల భారం ఎక్కువవుతోంది. దీంతో చివరికి ఆప్షన్‌ను తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. కేవలం ఎల్‌ఐసీ వెబ్ సైట్, పోర్టల్‌లో పూర్తిగా తొలగించింది. మిగతా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎప్పటిలాగే చేసుకోవచ్చు.

ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో అవకాశం..

గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే లాంటి యూపీఐ యాప్స్, ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా ఎప్పటిలాగే ప్రీమియం చెల్లించవచ్చని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఛార్జీల భారాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఇక ఛార్జీలు చెల్లించకుండా ప్రీమియం చెల్లించాలంటే ఎల్‌ఐసీ వెబ్ సైట్, యాప్ ద్వారా చేయాలి. డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు ఎంచుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించే సమయంలో ఫ్లాట్‌ఫామ్స్ ఏడీఆర్ ఛార్జీలను విధిస్తూ ఉంటాయి.

Follow Us