ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురించి అసలు నిజాలు

Venkatrao Lella

Images: Pinterest

07 OCT 2026

భారత ప్రభుత్వం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్‌గా నియమించింది. ఈ నియామకం డిసెంబర్ 11, 2024 నుండి అమల్లోకి వచ్చింది. 

కేబినెట్ నియామకాల కమిటీ ఈ ప్రతిష్టాత్మక పదవికి ఆయన పేరును ఆమోదించగా.. మల్హోత్రా మూడేళ్లపాటు పదవీకాలంలో కొనసాగనున్నారు.

డిసెంబర్ 10, 2024తో శక్తికాంతదాస్ పదవీకాలం ముగియగా.. ఆయన స్థానంలో రాజస్థాన్ కేడర్‌కు 1990 ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) కాన్పూర్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టభద్రుడైన మల్హోత్రా.. అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.

33 సంవత్సరాలకు పైగా విశిష్టమైన సేవ చేసిన మల్హోత్రా.. విద్యుత్, ఆర్థిక, పన్నుల శాఖ, సమాచార సాంకేతికత, మరియు గనులు వంటి విభిన్న రంగాలలో పనిచేశారు. దీనికి ముందు ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు.

మల్హోత్రాకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల రంగాలలో విస్తృతమైన నైపుణ్యం ఉంది. దేశంలో ఆర్బీఐ గవర్నర్ అత్యంత పవర్‌ఫుర్ పోస్ట్. కరెన్సీ నోట్లపై వారి సంతకం ఉంటుంది.

రాజస్థాన్‌లోని బికనీర్‌లో 1968 ఫిబ్రవరి 14న సంజయ్ మల్హోత్రా జన్మించారు. ఆయన తండ్రి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అధికారిగా పనిచేశారు.

తొలుత 2000లో ఒక కేంద్రమంత్రికి ప్రైవేట్ సెక్రటరిగా సంజయ్ మల్హోత్రా పనిచేశారు. 2003 నుంచి 2020 వరకు రాజస్థాన్ ప్రభుత్వంలో గనులు,ఆర్థిక, ఇంధన, వాణిజ్య పన్నులు విభాగాలలో సేవలందించారు

సంజయ్ మల్హోత్రా తన ఉద్యోగ జీవితంలో ఎన్నో పదవులను నిర్వహించారు. చివరికి అత్యున్నత పదవి ఆర్బీఐ గవర్నర్‌గా అవకాశం దక్కింది.