AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో అంతస్తునుంచి పడిపోయిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు!

రెండో అంతస్తునుంచి పడిపోయిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు!

Phani CH
|

Updated on: Oct 08, 2026 | 6:36 PM

Share

ఈజిప్టులోని గిజాలో రెండో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడుతున్న ఐదేళ్ల బాలుడిని అహ్మద్‌ రగబ్‌ అనే యువకుడు సమయస్ఫూర్తితో పట్టుకుని కాపాడాడు. బాలుడు తొలుత బట్టలు ఆరేసే తీగపై పడటంతో వేగం కొద్దిగా తగ్గింది. వెంటనే పరుగెత్తుకొచ్చిన రగబ్‌ నేలను తాకకముందే బాలుడిని పట్టుకున్నాడు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు అతడిని రియల్‌ హీరోగా ప్రశంసిస్తున్నారు.

ఈజిప్టులోని గిజా నగరంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. రెండో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోతున్న ఐదేళ్ల బాలుడిని ఓ యువకుడు అద్భుతమైన సమయస్ఫూర్తితో గాల్లోనే పట్టుకుని ప్రాణాలను కాపాడాడు. ఆ పసి ప్రాణాన్ని నిలబెట్టిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గిజాలోని అర్ద్ ఎల్-లెవా ప్రాంతంలో అహ్మద్ రగబ్ అనే యువకుడు ఒక దుకాణం దగ్గర నిల్చుని ఉన్నాడు. ఇంతలో సమీప భవనం నుంచి కేకలు, ఏడుపులు వినిపించడంతో అటువైపు చూశాడు. క్షణాల వ్యవధిలో ఓ చిన్నారి రెండో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు జారిపోవడాన్ని గమనించాడు. వెంటనే చాకచక్యంగా స్పందించిన రగబ్, బాలుడు పడే ప్రదేశం వైపు వేగంగా పరుగెత్తాడు.కింద పడే క్రమంలో బాలుడు మొదట బట్టలు ఆరేసే తీగ పై పడ్డాడు. ఇది పిల్లాడు కింద పడే వేగాన్ని కొద్దిగా తగ్గించడంతో, రగబ్‌కు అతడిని పట్టుకోవడానికి కొద్దిపాటి సమయం దొరికింది. బాలుడు నేరుగా నేలపై పడకముందే వాయువేగంతో కదిలిన రగబ్ సురక్షితంగా బాలుడ్ని పట్టుకున్నాడు. దీంతో పెద్ద ప్రమాదం తపినట్లయింది. ఈ ఘటనపై రగబ్ స్పందిస్తూ.. “అదంతా క్షణాల్లో జరిగిపోయింది. ప్రమాదంలో ఉన్న పిల్లాడిని చూసిన వెంటనే నా శరీరం దానంతట అదే స్పందించింది” అని చెప్పాడు. ఆ సమయంలో అంత వేగంగా పట్టుకోగలనని తాను కూడా ఊహించలేదని వినమ్రంగా తెలిపాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిని ‘రియల్ హీరో’గా కొనియాడుతుంటే, రగబ్ మాత్రం ఆ ప్రశంసలను సున్నితంగా తిరస్కరించాడు. తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బాల్కనీలు, కిటికీల దగ్గర పిల్లలు పైకి ఎక్కేలా కుర్చీలు లేదా వస్తువులను ఉంచవద్దని అతను విజ్ఞప్తి చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏఐతో పెను ప్రమాదం తప్పదు.. ఓపెన్‌ ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ టీమ్ కీలక ఉద్యోగి రాజీనామా

ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..

విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌.. తెలంగాణలో పెరిగిన కరెంట్‌ ఛార్జీలు

చదువుకుంటాను.. సాయం చేయండి!

డ్రైఫ్రూట్స్‌ ఆర్డర్‌ డెలివరీ.. క్షణాల్లో ఖాతా ఖాళీ

Follow Us