డ్రైఫ్రూట్స్ ఆర్డర్ డెలివరీ.. క్షణాల్లో ఖాతా ఖాళీ
హైదరాబాద్ సనత్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగిని డ్రై ఫ్రూట్స్ హోం డెలివరీ పేరుతో సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.2.60 లక్షలు పోగొట్టుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చూసి రూ.1,700కు డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేశారు. రీఫండ్ పేరుతో నిందితులు పలుమార్లు క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేయించడంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు సరి కొత్త వ్యూహాలతో ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. తాజాగా డ్రై ఫ్రూట్స్ హోం డెలివరీ పేరుతో సనత్‌నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగిని.. మీనా అహుజాను నమ్మించి ఏకంగా రూ. 2.60 లక్షలు కాజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రై ఫ్రూట్స్ హోం డెలివరీ ప్రకటనను చూసిన మీనా ఆ ప్రకటనను నమ్మి రూ.1,700 విలువైన డ్రై ఫ్రూట్స్‌ను ఆర్డర్ చేసి ఆన్‌లైన్‌లో ఎమౌంట్ చెల్లించారు. కొంతసేపటి తర్వాత అదే ఫోన్ నంబర్ నుంచి ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. డ్రై ఫ్రూట్స్ పార్సిల్ క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో వస్తుందని, ముందుగా చెల్లించిన రూ.1,700 మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని నమ్మించాడు. అనంతరం ఓ క్యూఆర్ కోడ్‌ను పంపించి దాన్ని స్కాన్ చేయాలని సూచించాడు. మహిళ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆమె ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.21,700 డెబిట్ అయ్యాయి. తన ఖాతా నుంచి నగదు డెబిట్ కావడంతో మహిళ ఆ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పొరపాటున నగదు డెబిట్ అయిందని, మొత్తం తిరిగి జమ చేస్తామని నిందితుడు నమ్మించాడు. మరో క్యూఆర్ కోడ్‌ను పంపి స్కాన్ చేయించాడు. ఈసారి రూ.43,000 ఆమె ఖాతా నుంచి మాయమయ్యాయి. ఇలా రీఫండ్ పేరుతో పలుమార్లు క్యూఆర్ కోడ్‌లు పంపించి.. మహిళను నమ్మిస్తూ మొత్తం రూ.2,60,100 స్వాహా చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.మరోవైపు నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా ముఠాలు విచ్చలవిడిగా చోరీలకు పాల్పడుతున్నాయి. రైతుబజార్లు, మార్కెట్లు, బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణికులను నెడుతున్నట్లు నటిస్తూ బంగారం, నగదు అపహరిస్తున్నాయి. బేగంబజార్, ధూల్‌పేట్ ప్రాంతాల్లో వృద్ధుల దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహ వేడుకల్లో బంధువుల్లా ప్రవేశించి నగలు కొట్టేయడం, తక్కువ ధరకే పాత బంగారం లేదా విదేశీ కరెన్సీ ఇస్తామంటూ బురిడీ కొట్టించడం లాంటి మోసాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేశామని, అపరిచితులు పంపే క్యూఆర్ కోడ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కాన్ చేయవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Elon Musk: మళ్లీ..ప్రపంచ ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్
వినియోగదారులకు గుడ్‌న్యూస్.. నెలరోజులు చాట్‌జీపీ ప్లస్ ఫ్రీ!
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
CM Sangma: మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..

