Varanasi: వారణాసి సినిమాలోకి హాలీవుడ్ హీరోయిన్
రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మహేష్‌బాబుతో ఆమెకు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ‘RRR’లో జెన్నీ పాత్రకు డైసీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
రాజమౌళి దర్శకత్వంలో , మహేష్ బాబు హీరోగా చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో మరో హాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్న తెలుస్తోంది. బ్రిటిష్ నటి డైసీ జెస్సికా ఎడ్గర్ జోన్స్ ‘వారణాసి’ మూవీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పడో టాక్ వైరల్ అవుతోంది. మహేష్ బాబు, డైసీల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని, వారి కెమిస్ట్రీయే సినిమాకు ప్రధాన ఆకర్షణ అని అంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. అయితే, జక్కన్న టీం నుంచి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. వారణాసి కంటే ముందే.. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘జెన్నీ’ అనే బ్రిటిష్ అమ్మాయి పాత్ర కోసం డైసీని మొదట ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాలు, షెడ్యూల్ సమస్యల వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు, రాజమౌళి ఆమెను తిరిగి తీసుకువచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే, డైసీ ‘వారణాసి’ చిత్రంతో భారతీయ చిత్రసీమలో అరంగేట్రం చేయనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు – సింగీతం సినిమా.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే
Aggipette Macha: ఆ అమాయకపు తింగరి కోపం చెదిరిపోయింది.. ఆ మహామ్మారే బలితీసుకుంది
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
