AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు - సింగీతం సినిమా.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే

చిరు – సింగీతం సినిమా.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే

Phani CH
|

Updated on: Oct 08, 2026 | 3:35 PM

Share

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాల్సిన ‘భూలోకవీరుడు’ అప్పట్లో భారీ అంచనాలతో ప్రారంభమైంది. చిరంజీవి, టబు జంటగా నటించాల్సిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. రెండు షెడ్యూళ్ల షూటింగ్‌ పూర్తయిన తర్వాత కథ, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, పెరుగుతున్న బడ్జెట్‌ కారణాలతో సినిమా ఆగిపోయింది. ఈ సినిమా కోసం ఇళయరాజా స్వరపరిచిన రెండు పాటలు మాత్రం ఆ తర్వాత మరో రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి సినీలోకానికి తీరని లోటు. దాదాపు 95 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం పేరుతో సినిమాను తెరకెక్కించి సినిమా పట్ల తనకున్న అభిరుచిని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన కెరీర్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. అందులో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేయాల్సిన ‘భూలోకవీరుడు’ ప్రాజెక్ట్ ఒకటి. అప్పట్లోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యాక అనూహ్యంగా ఆగిపోయింది. 1996 ప్రాంతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రసిద్ధ నిర్మాత సి. అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అప్పటికే ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ చిత్రాలతో సైన్స్ ఫిక్షన్, జానపద జోనర్లలో అద్భుతాలు సృష్టించిన సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఇందులో చిరంజీవి సరసన కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ టబును ఎంపిక చేశారు. సత్యానంద్ ఫాంటసీ కథను సిద్ధం చేయగా, ఇళయరాజాని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. చిరు – టబుల కాంబినేషన్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు అప్పట్లో భారీ అంచనాలను పెంచేశాయి. భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ రెండు షెడ్యూళ్ల పాటు వేగంగా జరిగింది. ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఇళయరాజా స్వరపరిచిన రెండు పాటలను కూడా చిత్రీకరించారు. అయితే, కథా విస్తరణలో పూర్తిస్థాయి బలం కనిపించకపోవడం, గ్రాఫిక్స్-విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అనుకున్న స్థాయి రాకపోవడం , బడ్జెట్ అంచనాలు పెరిగిపోవడంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. దీంతో చిరంజీవి, సింగీతం కాంబోలో రావలసిన ఈ మూవీ మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ఈ సినిమా నిలిచిపోయినా, ‘భూలోకవీరుడు’ కోసం ఇళయరాజా స్వరపరిచిన ఆ రెండు పాటలు వృథా పోలేదు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవితో అశ్వినీ దత్ ప్రారంభించిన మరో ప్రాజెక్ట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా కోసం మణిశర్మ రికార్డ్ చేసిన పాటలను, ‘భూలోకవీరుడు’లోని ఇళయరాజా పాటలను కలిపి వైజయంతీ మూవీస్ ‘వినాలని ఉంది’ పేరుతో ఒక ప్రత్యేక ఆడియో క్యాసెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అనంతరం వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘చూడాలని ఉంది’ చిత్రం థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ప్రత్యేక పాటలను రీల్స్‌కు జత చేసి థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సాంగ్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ‘భూలోకవీరుడు’ పూర్తయి ఉంటే, తెలుగు చిత్రసీమలో మరొక క్లాసిక్ సోషియో ఫాంటసీగా నిలిచిపోయేదని సినీ విశ్లేషకులు భావిస్తుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aggipette Macha: ఆ అమాయకపు తింగరి కోపం చెదిరిపోయింది.. ఆ మహామ్మారే బలితీసుకుంది

Follow Us