ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
నోయిడా సెక్టార్ 18లోని డీఎల్‌ఎఫ్ మాల్‌లో ఓ మహిళ నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్ బాటిళ్లను చోరీ చేస్తూ పట్టుబడిన ఘటన వైరల్‌గా మారింది. ఖరీదైన దుస్తులు, రిచ్ లుక్ బ్యాగ్‌తో వచ్చిన ఆమెను భద్రతా సిబ్బంది అనుమానించారు. సీసీటీవీ పరిశీలించగా నిత్యావసరాల విభాగం నుంచి వస్తువులను బ్యాగ్‌లో పెట్టుకున్నట్లు గుర్తించారు. ఎగ్జిట్ వద్ద తనిఖీ చేయగా చోరీ చేసిన వస్తువులు లభించాయి. తర్వాత వాటికి బిల్లు చెల్లించినట్లు సమాచారం.
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్, ఉన్నత కుటుంబానికి చెందిన మహిళలా కనిపిస్తున్న ఆ వ్యక్తి ప్రవర్తన చూసి మాల్ సిబ్బందికే మైండ్ బ్లాంక్ అయ్యింది. ఓ ప్రముఖ మాల్‌లో నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్ బాటిళ్లను దొంగిలిస్తూ ఒక మహిళ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈ విచిత్ర ఘటన నోయిడాలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఢిల్లీ శివార్లలోని ఉత్తరప్రదేశ్, నోయిడా సెక్టార్ 18లో ఉన్న డీఎల్‌ఎఫ్ మాల్‌లో ఈ ఘటన జరిగింది. సదరు మహిళ మాల్ నుంచి అనుమానాస్పదంగా బయటకు వెళ్తుండడాన్ని భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో ఆమె నిత్యావసర సరుకుల విభాగం నుంచి నెయ్యి మరియు రిఫైన్డ్ ఆయిల్ బాటిళ్లను దొంగిలించి తన హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో ఎగ్జిట్ గేట్ వద్ద ఆ మహిళను అడ్డుకున్న సిబ్బంది, ఆమె బ్యాగ్‌ను తనిఖీ చేసి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిలదీయడంతో, ఆమె తాను దొంగిలించిన వస్తువులకు బిల్లు చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. గత నెల రోజులుగా ఆ మహిళ క్రమం తప్పకుండా మాల్‌కు వస్తోందని, గతంలో కూడా ఇలాగే పలు వస్తువులను చోరీ చేసినట్లు సీసీటీవీల్లో నమోదైందని మాల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యుత్ వినియోగదారులకు షాక్.. తెలంగాణలో పెరిగిన కరెంట్ ఛార్జీలు
డ్రైఫ్రూట్స్ ఆర్డర్ డెలివరీ.. క్షణాల్లో ఖాతా ఖాళీ
Elon Musk: మళ్లీ..ప్రపంచ ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్
వినియోగదారులకు గుడ్‌న్యూస్.. నెలరోజులు చాట్‌జీపీ ప్లస్ ఫ్రీ!
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..

